MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • కప్పు టీ... మీ ఆయుష్షుని పెంచుతుంది...!

కప్పు టీ... మీ ఆయుష్షుని పెంచుతుంది...!

భారతీయుల ఇళ్లల్లో టీ చాలా కామన్ పానియం. మనకు ఇంత ఆనందాన్ని ఇచ్చే టీ... మన జీవిత ఆయుష్షును కూడా పెంచుతుంది అంటే నమ్ముతారా..? మీరు చదివింది నిజమే.. టీ తాగడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 01 2022, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉదయం లేవగానే చాలా మందికి కప్పు టీ కానీ, కాఫీ గానీ తాగనిది రోజు మొదలుకాదు. వేడి వేడి టీ, కాఫీ పొగలుకక్కుతూ.. కమ్మని వాసనతో మన ముందుకు వస్తే ప్రాణం లేచినట్లే అవుతుంది. ముఖ్యంగా.. భారతీయుల ఇళ్లల్లో టీ చాలా కామన్ పానియం. మనకు ఇంత ఆనందాన్ని ఇచ్చే టీ... మన జీవిత ఆయుష్షును కూడా పెంచుతుంది అంటే నమ్ముతారా..? మీరు చదివింది నిజమే.. టీ తాగడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
espressos

espressos

మన దేశంలో ప్రజలు చాలా రకాల టీలను ఆస్వాదిస్తూ ఉంటారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ, అల్లం టీ... ఇలా ఒక్కొక్కరు ఒక్కో టీ తాగడానికి ఇష్టపడుతూ ఉటారు. ఎలా తీసుకున్నా కూడా.. టీ వల్ల ప్రయోజనమే ఉంటుందట.

36

 ఒక రోజులో రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల బ్లాక్ టీ తాగే వారు బ్లాక్ టీ తాగని వారితో పోలిస్తే చనిపోయే ప్రమాదం 9 నుండి 13 శాతం తక్కువగా ఉంటుంది. ఇంకా ఏమిటంటే, పాలు లేదా పంచదారను ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి - కాఫీకి కూడా అదే వర్తిస్తుందట.

 

46
tea

tea

అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో 89 శాతం మంది సాధారణ టీ తాగేవారు ఉండగా... వారిలో బ్లాక్ టీ తాగేవారు కూడా ఉన్నారట. ఇక గ్రీన్ టీ తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందట. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

56

ఈ పానీయం క్రమం తప్పకుండా తాగడం గుండె జబ్బులు, చిత్తవైకల్యం ,క్యాన్సర్‌ లను ఎదుర్కొనవచ్చట.ఈ ప్రభావం పానీయంలోని యాంటీ ఆక్సిడెంట్లే అందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.  ఇది రక్తం నుండి హాని కలిగించే అణువులను తొలగించి మంటను తగ్గిస్తుంది. రోజుకు ఐదు బ్రూ కాఫీలు  తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని మరో అధ్యయనం వెల్లడించింది.
 

66
green tea

green tea

అదే సమయంలో, వేడి వేడి టీని తాగకూడదు అని చెప్పే అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది థర్మల్ గాయం అని పిలువబడే ఆహార పైపును దెబ్బతీయడం ద్వారా గొంతు క్యాన్సర్ లేదా అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందని మరో అధ్యయనంలో తేలడం గమనార్హం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved