Health tips: ఇవి తింటే చాలు.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది!
మనం తీసుకునే ఫుడ్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యానికి మంచిచేస్తే.. మరికొన్ని చెడు చేస్తాయి. అయితే రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అవెంటో ఒకసారి తెలుసుకోండి.

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచివి, రెండు చెడువి. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటుతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఎలా?
నిపుణుల ప్రకారం చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం గజిబిజి లైఫ్ స్టైల్. పోషకాలు లేని ఆహారం తినడం, వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాలతో చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతున్నాయి. అయితే రోజూవారి జీవితంలో కొన్నిమార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని సులభంగా నివారించవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
నెయ్యి
ప్రాసెస్ చేసిన వెజిటబుల్ ఆయిల్స్, ట్రాన్స్ ఫ్యాట్‌లను పూర్తిగా మానుకోండి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దానికి బదులుగా నెయ్యి లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ను చేర్చుకోండి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
ఫైబర్ ఫుడ్స్
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినండి. కూరగాయలు, పండ్లు, ఓట్స్, తృణధాన్యాలు లాంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి.
తిన్న తర్వాత నడక
తిన్న తర్వాత ఒకే చోట కూర్చుంటే శరీరంలో చక్కెర, కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
ఉపవాసం ఉండండి:
వారానికి 1-2 సార్లు 12-14 గంటలు ఉపవాసం ఉండండి. ఇది కొవ్వు పెరుగుదలను మార్చడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ధూమపానం
ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఈ అలవాటు ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
నట్స్:
నానబెట్టిన నట్స్, గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోండి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.