రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా..? ఈ యోగాసనాలు ట్రై చేయండి.!
కారణం ఏదైనా... సరైన నిద్ర లేకపోవడం వల్ల.. మనకు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు పక్కన పెట్టినా.. రాత్రి నిద్ర లేకపోతే.. ఆ తర్వాత రోజు కనీసం మనం ఉత్సాహంగా పని కూడా చేయలేం.

Morning sleep issue
మనలో చాలా మంది రాత్రిపూట నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా నిద్రపట్టక పోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కారణం ఏదైనా... సరైన నిద్ర లేకపోవడం వల్ల.. మనకు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు పక్కన పెట్టినా.. రాత్రి నిద్ర లేకపోతే.. ఆ తర్వాత రోజు కనీసం మనం ఉత్సాహంగా పని కూడా చేయలేం. మరి ఈ నిద్ర సమస్యను పరిష్కరించడమెలా అంటే.. యోగానే సమాధానం. కొన్ని యోగాసనాలను రోజూ వేయడం వల్ల.. ప్రశాంతంగా నిద్రపోగలమట. మరి ఆ ఆసనాలేంటో ఓసారి చూసేద్దామా..
1.త్రికోనాసనం..
త్రికోనాసనం వేయడం వల్ల... మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఈ త్రికోణాసనాన్ని రెండు భాగాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి కుడి వైపు.. మరొకటి ఎడమ వైపు. ముందుగా యోగా మ్యాట్ పై నిటారుగా నిలపడాలి. తర్వాత... మీ రెండు కాళ్లను.. మూడు అడుగుల దూరం జరపాలి. ఈ భంగిమలో కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
తర్వాత.. త్రికోనాసనం వేయానికి ప్రయత్నించాలి. ముందుగా.. కుడి వైపుకి వంగి.. మీ కుడికాలిని కుడి చేతితో పట్టుకోవాలి. ఆ సమయంలో ఎడమ చేతిని పైకి ఎత్తి ఉంచాలి. ఆ తర్వాత.. ఈసారి ఎడమ వైపు వంగి.. ఎడమ కాలుని ఎడమ చేతితో తాకాలి. ఈ సమయంలో కుడి చేతిని పైకి ఎత్తాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణమౌతుంది. దీనిని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి.
Bhujangasana
2.భుజంగాసనం..
ఈ భుజంగాసనాన్ని వెనకకు వంచి చేస్తారు. ఇది ఛాతీ, భుజాలు , పొత్తికడుపును సాగదీసేటప్పుడు వెన్నెముకను బలపరుస్తుంది. ఈ భంగిమ శరీరం అలసట , ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
3.హలాసనం..
ప్లో పోజ్, లేదా హలాసానా, వెన్నెముక, భుజాలు, కాళ్ళ వెనుకభాగాలను విస్తరించి, ఎగువ వీపు, ఛాతీని తెరుస్తుంది. ఇది కడుపు అవయవాలను ప్రేరేపిస్తుంది, మనస్సును రిలాక్స్ చేస్తుంది, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ భంగిమ కోసం మీ అరచేతులను క్రిందికి ఉంచి మీ వెనుకభాగంలో పడుకోండి. అప్పుడు, మీ కోర్ కండరాలను ఉపయోగించి, నేల నుండి మీ పాదాలను ఎత్తండి, ఆ సమయంలో కాళ్లను నిటారుగా ఉంచాలి.
4.వజ్రాసనం..
వజ్రాసనం మనల్ని ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఫలితంగా, ఇది మంచి రాత్రి నిద్ర పొందడానికి మాకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు మరియు పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి ప్రజలకు సహాయపడుతుందని నిరూపించబడింది.
5.జను సీర్షాసన..
తల నుండి మోకాళ్ల వరకు ఉండే భంగిమ టెన్షన్‌ని తగ్గించడానికి, మనస్సును రిలాక్స్ చేయడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, రుతుక్రమం ఆగిన లక్షణాలతో బాధపడుతుంటే ఈ భంగిమ చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది.