ఈ విషయం తెలిస్తే ఫ్రైడ్ ఫుడ్స్ ను అస్సలు తినరు
ఫ్రైడ్ ఫుడ్స్ వాసనే కాదు.. వాటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. వీటి వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వెంటనే తినేయాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని తింటే క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది.

fried foods
ఫ్రైడ్ ఫుడ్స్ ను ఇష్టపడనివారుండరు. ఎందుకంటే దీని వాసన, రుచి అద్బుతంగా ఉంటాయి. అందుకే వీటిని కొంతమంది రెగ్యులర్ గా తింటుంటారు. ఇవి టేస్టీగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..
బరువు పెరగడం
బరువు పెరిగినంత ఈజీగా.. బరువు తగ్గరు. నిజానికి బరువు పెరగడం మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి అలసిపోయిన వారున్నారు. అయితే వేయించిన ఆహారాలను తింటే కూడా చాలా తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకే ఈ ఆహారాల్లో సాధారణంగా కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ లేదా ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అలాగే ఊబకాయం బారిన కూడా పడతారు.
గుండె సమస్యలు
వేయించిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
జీర్ణ సమస్యలు
వేయించిన ఆహారాలు అంత తొందరగా జీర్ణం కావు. ఇవి జీర్ణవ్యవస్థకు ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ ను తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి.
డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది
వేయించిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకండి.
fried food
క్యాన్సర్ ప్రమాదం
కార్సినోజెనిక్ పదార్ధం యాక్రిలామైడ్ పిండి పదార్ధాలను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించినప్పుడు ఏర్పడుతుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఇప్పటినుంచైనా ఫ్రైడ్ ఫుడ్స్ ను తినండి.