Chapatis to Control Blood Sugar: షుగర్‌కి చెక్ పెట్టే 4 రకాల చపాతీలు ఇవిగో
Chapatis to Control Blood Sugar: మీకు షుగర్ ఉందా? ఈ 4 రకాల పిండితో చేసిన చపాతీలు గోధుమపిండి చపాతీల కంటే మీకు ఎక్కువ మేలు చేస్తాయి. ఆ చపాతీలు, వాటిని తయారు చేసే విధానాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ చాలా చిన్న వయసులోనే వచ్చేస్తోంది. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల షుగర్ అటాక్ అవుతోంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గి, రక్తంలో షుగర్ పెరగడం వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది.
షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి షుగర్ ఉన్నవాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు తమ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొన్ని రకాల చపాతీలు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
జొన్న చపాతీ
మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే జొన్న పిండితో చపాతీలు చేసుకుని తినండి. జొన్నలో మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జొన్న చపాతీలో పిండి పదార్థం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది డాక్టర్లు ఈ చపాతీలు తినమంటారు.
తయారీ విధానం:
ఒక కప్పు జొన్న పిండిలో ఒక చెంచా నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. కొంత సేపు ఆగి చపాతీలు చేసుకుని తినండి.
రాగి చపాతీ
రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీంతో చేసిన చపాతీలు తినడం షుగర్ ఉన్నవాళ్లకి కూడా మంచిదే. ఇది షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు. అంతేకాదు రాగిలో మినరల్స్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. అందుకే రాత్రిపూట షుగర్ ఉన్నవాళ్ళు రాగి చపాతీలు తినొచ్చు.
తయారీ విధానం:
ఒక కప్పు రాగి పిండిలో నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలపండి. చపాతీలు విరగకుండా ఉండాలంటే మెల్లగా కలపండి. చపాతీలు వేసేటప్పుడు ఒక గుడ్డతో నెమ్మదిగా నొక్కుతూ ఉంటే బాగా వస్తాయి.
ఓట్స్ చపాతీ
ఓట్స్ తింటే బరువు తగ్గుతారని తెలుసు కదా.. అయితే షుగర్ ఉన్నవాళ్లకి కూడా ఓట్స్ చాలా మంచివట. ఓట్స్ చపాతీలు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఓట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.
తయారీ విధానం:
ముందుగా ఓట్స్‌ని మిక్సీలో బాగా పొడి చేసి, గోధుమపిండితో కలపండి. దానికి కొద్దిగా ఉప్పు వేసి, నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలపండి. తర్వాత చపాతీలు చేసుకుని తినండి.