- Home
- Life
- Health
- Brain Boosting Seeds for Kids: చియా, గుమ్మడి, అవిసె గింజలతో పిల్లల మెదడుకి ఎంత మేలో తెలుసా?
Brain Boosting Seeds for Kids: చియా, గుమ్మడి, అవిసె గింజలతో పిల్లల మెదడుకి ఎంత మేలో తెలుసా?
సహజంగానే చాలా మంది పిల్లలు షార్ప్ గా ఉంటారు. ఏది చెప్పిన ఇట్టే పట్టేస్తుంటారు. పిల్లలు తెలివిగా ఉండడానికి పేరెంట్స్ వారికిచ్చే ఆహారంలో కొన్ని చేంజెస్ చేయాలి అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల గింజలు కలపడం వల్ల వారి బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుందట. ఆ విత్తనాలెంటో ఇక్కడ చూద్దాం.

ప్రతి పేరెంట్స్ వారి పిల్లలు తెలివిగా, చురుకుగా ఉండాలనుకుంటారు. మరి పిల్లలు అలా ఆక్టివ్ గా ఉండాలంటే పేరెంట్స్ వారికిచ్చే ఫుడ్ పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ వారి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తాయి.
పిల్లల ఆహారంలో కొన్ని రకాల విత్తనాలు చేర్చడం ద్వారా వారి బ్రెయిన్ మరింత షార్ప్ గా పనిచేస్తుందట. ఇంతకీ ఆ గింజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్ ఫ్లవర్ సీడ్స్
పొద్దుతిరుగుడు గింజలలో అధిక ఫైబర్, ఇనుము ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఇ, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పిల్లలు వీటిని నేరుగా తినవచ్చు. సలాడ్, ఇతర కూరగాయలతో కలిపి తినవచ్చు.
చియా గింజలు
చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పిల్లల ఆహారంలో వీటిని చేర్చడం చాలా ప్రయోజనకరం. చియా విత్తనాలను పిల్లలకు వాటర్ లేదా పాలలో నానబెట్టి ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచి పోషకాలు లభిస్తాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడికాయ విత్తనాలు పోషకాల గని. ఇందులో మెగ్నీషియం, జింక్, ఇనుము, రాగి తగిన మోతాదులో ఉంటాయి. ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే జింక్ జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి పిల్లలకు ఈ విత్తనాలను ఇవ్వడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
అవిసె గింజలు
అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఈ విత్తనాలలో అధిక విటమిన్ సి ఉండటం వల్ల.. పిల్లలను అంటువ్యాధుల బారినుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.