- Home
- Entertainment
- Gossips
- జూనియర్ ఎన్టీఆర్ కు అనారోగ్యం.. డ్రాగన్ షూటింగ్ కు బ్రేక్, ఆందోళనలో అభిమానులు, నిజమెంత?
జూనియర్ ఎన్టీఆర్ కు అనారోగ్యం.. డ్రాగన్ షూటింగ్ కు బ్రేక్, ఆందోళనలో అభిమానులు, నిజమెంత?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఏమయ్యింది? అనారోగ్యంతో తారక్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడా? జూనియర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో నిజమెంత.? డ్రాగన్ షూటింగ్ విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?

డ్రాగన్ సినిమా షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీ..
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్.. ఆతరువాత దేవర వంటి హిట్ ను కూడా అందుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్.. ఈమూవీపై భారీ అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కెజియఫ్, సలార్ సినిమాతో భారీ సక్సెస్ లు చూసిన .. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని ఆయన హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కారణంగా సినిమా ప్రారంభం నుంచే విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు...
డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతోంది. షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. అయినా సరే ఈసినిమా నుంచి అభిమానులు సంతృప్తి పడేలా అప్ డేట్ మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ప్రశాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. అది గ్రహించిన టీమ్.. రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయగా.. అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుని సోషల్ మీడియాను షేక్ చేసింది.
డ్రాగన్ షూటింగ్ కు అవాంతరాలు..
డ్రాగన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది జూన్ నెలలో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి నిరంతరంగా షూటింగ్ జరుగుతూ వస్తోంది. మధ్యలో ఎన్టీఆర్‌కు చిన్న యాక్సిడెంట్ జరగడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆపేశారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ హెల్త్ ఇష్యూ వల్లే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం.
ఎన్టీఆర్ గత రెండు రోజులుగా స్వల్పంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. వరుసగా షూటింగ్‌లో పాల్గొనడం, ఎక్కువ శారీరక శ్రమ కారణంగా అలసట.. జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కనీసం మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఎన్టీఆర్ టీమ్ కానీ, మూవీ టీమ్ కానీ స్పందించలేదు. ఇది ఒక రూమర్ గానే వైరల్ అవుతోంది.
రెస్ట్ మోడ్‌లో తారక్..
ఎన్టీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లారని, డ్రాగన్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. గత వారం రోజులుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం బ్రేక్ పడినా.. ఎన్టీఆర్ కోలుకున్న వెంటనే షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఎప్పుడు?
ఇక ఈ సినిమాను ను 2026 జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీమ్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో.. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు.

