- Home
- Entertainment
- Gossips
- చిరంజీవి , బాలకృష్ణ మధ్య అనిల్ రావిపూడి గమనించిన పోలిక ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య ఉన్న తేడాలేంటి?
చిరంజీవి , బాలకృష్ణ మధ్య అనిల్ రావిపూడి గమనించిన పోలిక ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య ఉన్న తేడాలేంటి?
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రెండు మెయిన్ పిల్లర్స్ మాదిరి నిలబెట్టారు. ఈ ఇద్దరు హీరోల తీరు వేరు.. కానీ ఇద్దరిలో ఉన్న ఒక పోలిక ఏంటో తెలుసా? డైరెక్టర్ అనిల్ రావిపూడి గమనించిన విషయం ఏంటి?

ఫిల్మ్ ఇండస్ట్రీకి పిల్లర్స్ లా చిరంజీవి, బాలకృష్ణ...
90 వ దశకంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నాలుగు పిల్లర్స్ లా మారి నలుగురు హీరోలు నిలబెట్టారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మెయిన్ పిల్లర్స్ కాగా.. వెంకటే, నాగార్జున కూడా వీరికి తోడయ్యారు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలుగా.. భారీ ఫాలోయింగ్ తో ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ ను ఏలారు. భారీగా అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
70 ఏళ్ల చిరంజీవి, 65 ఏళ్ల బాలకృష్ణ ఇద్దర ఇప్పటికీ.. అదే ఫాలోయింగ్ తో, అదే దూకుడుతో సినిమాలు చేస్తూ.. వరుస సక్సెస్ లు సాధిస్తున్నారు. ఇద్దరు హీరోల సినిమాల మధ్య, అభిమానులు మధ్య పోటీ ఉన్నా.. పర్సనల్ గా మాత్రం మంచి అనుబంధాన్ని మెయింటేన్ చేస్తున్నారు స్టార్ సీనియర్ హీరోలు .
ఏజ్ పెరుగుతున్నా తగ్గేది లేదంటున్న హీరోలు..
ప్రస్తుతం టాలీవుడ్ పిల్లర్స్ గా ఉన్న నలుగురు హీరోలు 65 ఏళ్ల బయసును క్రాస్ చేశారు. కానీ ఫాలోయింగ్ , ఇమేజ్ లో మాత్రం ఇప్పటికీ తగ్గేదే లేదంటున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ హీరోలలో ముగ్గురితో సినిమాలు చేశారు. వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి తో అనిల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు.
ఈక్రమంలో బాలయ్య, చిరంజీవితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు స్టార్ డైరెక్టర్. నాగార్జునతో సినిమా విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మంచి సబ్జెక్ట్ సెట్ అయితే పక్కాగా చేస్తానన్నారు.
చిరు, బాలయ్య మధ్య అనిల్ రావిపూడి గమనించిన అంశాలు..
బాలయ్య తో భగవంత్ కేసరి, చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో కలిసి పనిచేశారు కదా.. వారిద్దరిలో మధ్య మీరు గమనించిన డిఫరెన్స్, కంపారిజన్స్ గురించి చెప్పాలంటే ఏం చెపుతారు అని ప్రశ్న అనిల్ కు ఎదురయ్యింది. దానికి ఆయన మాట్లాడుతూ.. '' కంపారిజన్ అంటే నేను చేయలేను.. ఇద్దరు వెరీ ఇండివిడ్యూవల్.. ఇద్దరి తీరు వేరు.. ఇద్దరి దారులు కూడా వేరు.. బాలయ్య లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. మెగాస్టార్ లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఇద్దరు డీల్ చేసే విధానం కూడా వేరు వేరుగా ఉంటుంది. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేయలేము.'' అని అనిల్ రావిపూడి అన్నారు.
చిరంజీవ - బాలయ్య లో ఉన్న కామన్ పాయింట్..
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ను ఏ విషయంలో కంపేర్ చేయలేము అని అనిల్ రావిపూడి అన్నారు. కానీ ఇద్దరి మధ్య మాత్రం ఒక కామన్ పాయింట్ ఉందని ఆయన చెప్పారు. '' ఈ ఇద్దరు హీరోలు డైరెక్టర్లకు రెస్పెక్ట్ ఇస్తారు. వారి చెప్పింది చెప్పినట్టు చేస్తారు. నన్ను మాత్రం ఇద్దరు బాగా చూసుకున్నారు. నాకు తెలిసినంద వరకూ ఇద్దరి దగ్గర కామన్ గా ఉన్న అలవాటు అదే.'' అని అనిల్ రావిపూడి అన్నారు. రీసెంట్ గా చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి తిరుగులేని విజయాన్ని సాధించింది. చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈమూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు.
దూసుకుపోతున్న బాలయ్య...
ఇక బాలయ్య విషయానికి వస్తే.. 65 ఏళ్ల వయసులో కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. అఖండ సినిమా నుంచి ఆయన ఏ సినిమా చేసినా..అది సక్సెస్ అవుతోంది. రీసెంట్ గా అఖండ 2తో యావరేజ్ రిజెల్ట్ ను సాధించిన నటసింహం.. నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

