ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో.. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
కొన్ని కొన్ని సినిమాల వెనుక కథలు విచిత్రంగా ఉంటాయి. చిన్న సినిమాలు అయినా.. పెద్ద హీరోలకు కూడా చెమటలు పట్టిచే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కథ.. ఒకప్పుడు ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిందని మీకు తెలుసా?

మెగాస్టార్ కెరీర్ ను టర్న్ చేసిన మూవీ..
చిరంజీవి కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మూవీస్ అంటే.. మందుగా వెంటనే గుర్తుకు వచ్చేది గ్యాంగ్ లీడర్ .అప్పటి యూత్ ను ఉర్రూతలూగించిన ఈ సినిమా .. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది. విజయ బాపినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మాస్ సినిమా.. మంచి మ్యూజిక్ హిట్ గా కూడా నిలిచింది. ఈసినిమా పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉన్నాయి.
చిరంజీవి విజయశాంతి డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. సెంటిమెంట్ తో ప్యామిలీ ఆడియన్స్ ను ఏడిపించింది గ్యాంగ్ లీడర్ మూవీ. ఇక ఈసినిమా కథ వెనుక మరో పెద్ద కథ ఉంది. అదేంటి అనేది ఆమధ్య కాలంలో స్టార్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిన కథ..
గ్యాంగ్ లీడర్ కథను ఇంతకు ముందే బొమ్మరిల్లు సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు రాజాచంద్ర. ఆసినిమాలో శ్రీధర్ , మురళీ మోహన్, మాధవి లాంటి స్టార్ నటుడు యాక్ట్ చేశారు. ఈసినిమా ను హిట్ సినిమాల దర్శకుడు విజయబాపినీడు నిర్మించారు. అయితే ఇదే టైమ్ లో ఎన్టీఆర్ యమగోల రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలకు గట్టి పోటీ నడిచింది. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సినిమాకు పోటీగా వెళ్లి.. హిట్ అయ్యింది సినిమా. అటువంటి సినిమా కథను మరోసారి తెరకెక్కిస్తానని విజయబాపినీడు నటుడు మురళీ మోహన్ తో ముందే చెప్పారట.
బొమ్మరిల్లును గ్యాంగ్ లీడర్ గా తెరకెక్కించిన బాపినీడు..
బొమ్మరిల్లు సినిమా కథను మళ్లీ తెరకెక్కిస్తానని దర్శకుడు విజయబాపినీడు మురళీమోహన్ దగ్గర ప్రస్తావించారట. ఈ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బాపినీడు చాాలా కాన్ఫిడెంట్ గా మురళీ మోహన్ దగ్గర అన్నారట. మళ్లీ తీస్తే ఎవరు చూస్తారు.. అని మురళీ మోహన్ సందేహం వ్యక్తం చేయగా.. . కావాలంటే చూడు.. చిరంజీవి లాంటి మాస్ హీరోతో.. కథను కాస్త మార్పులు చేసి తీస్తాను.. అంది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడు అని బాపినీడి అన్నారట. అన్నట్టుగానే చిరంజీవితో గ్యాంగ్ లీడర్ సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .
బొమ్మరిల్లులో అలా.. గ్యాంగ్ లీడర్ లో ఇలా..
బొమ్మరిల్లు.. గ్యాంగ్ లీడర్ రెండు సినిమాల్లో మురళీ మోహన్ నటించారు. బొమ్మరిల్లు సినిమాలో అందరికంటే చిన్నవాడైన తమ్ముడి పాత్రలో మురళీ మోహన్ నటిస్తే.. ఎన్నో ఏళ్ళ తరువాత రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాలో మాత్రం.. చిరంజీవికి పెద్దన్నయ్య పాత్రలో మురళీ మోహన్ నటించారు. ఈసినిమా తరువాత మురళీ మోహన్ ను అందరు.. చిరంజీవి అన్నయ్య.. చిరంజీవికి అన్నయ్య అని పిలిచేవారట. చాలా కాలం తాను ఆడియన్స్ కు అలాగే గుర్తుండిపోయాను.. ఆ పాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ లీర్ కు ఉన్న క్రేజ్ కూడా అలాంటిదే అని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
దూసుకుపోతున్న చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గడంలేదు స్టార్ హీరో. రీసెంట్ గా మన శంకర వరప్రసాదుగారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఇక ఈసమ్మర్ లో విశ్వంభర సినిమాతో సందడి చేయబోతున్న చిరంజీవి.. బాబీ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.

