MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Gardening
  • ఈ మొక్కలుంటే మీ ఇల్లు అందంగా ఉంటుంది. నెగిటివిటీ కూడా తొలగిపోతుంది

ఈ మొక్కలుంటే మీ ఇల్లు అందంగా ఉంటుంది. నెగిటివిటీ కూడా తొలగిపోతుంది

కొన్ని రకాల మొక్కలు ఇంటిని అందంగా మార్చడమే కాకుండా.. ఇంటి ప్రతికూలతలను తొలగించడానికి కూడా సహాయపడతాయి. అవి ఏయే మొక్కలు అంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 20 2024, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఇంట్లో మొక్కలను పెంచడమంటే ప్రతి  ఒక్కరికీ ఇష్టమే. నిజానికి మొక్కలు మన ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో నెగిటివిటీని తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఉంచడానికి సహాయపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తులసి మొక్క

హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూస్తారు. అందుకే ఇంటికి ఒక తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలంటారు పెద్దలు. ఈ తులసి మొక్క ఆకులు దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ మొక్క ఇంట్లోని ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించేలా చేస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఈ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. 

36

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెడుతుంటారు. ఇదొక ఇండోర్ మొక్క. ఈ మొక్క గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. అయితే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.  ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్తారు.
 

46

పీస్ లిల్లీ

పేరుకు తగ్గట్టుగానే పీస్ లిల్లీ మన ఇంట్లో సుఖసంతోషాలతో కూడిన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ మొక్క చూడటానికి అందంగా ఉండటమే కాదు.. ఇది గాలిని శుద్ధి చేస్తుంది కూడా. ఈ మొక్క గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెడితే ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. 

56


మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్క ఎలా అయితే ఎదుగుతుందో.. మన ఇంట్లో సుఖసంతోషాలకు కొదవ అనేదే ఉండదని చెప్తారు. ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు.  అసలు విషయం ఏంటంటే? ఈ మొక్కకు ఎక్కువ కేరింగ్ అవసరం లేదు. తక్కువ సూర్యరశ్మి, తక్కువ నీళ్లతో ఈ మొక్క సులువుగా పెరుగుతుంది. 
 

66

కలబంద

తులసి, మనీ ప్లాంట్ తర్వాత కలబంద మొక్క భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది. కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడమే కాకుండా.. ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. తక్కువ సంరక్షణలో సులభంగా పెరిగే ఈ మొక్క చెడు శక్తి నుంచి కూడా మీ ఇంటిని రక్షిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved