- Home
- Technology
- Gadgets
- TCL: 64 శాతం డిస్కౌంట్.. రూ. 44 వేలకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఫీచర్లు కూడా మాములుగా ఉండవు
TCL: 64 శాతం డిస్కౌంట్.. రూ. 44 వేలకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఫీచర్లు కూడా మాములుగా ఉండవు
TCL: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద స్క్రీన్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే టీసీఎల్ నుంచి ఒక అదిరిపోయే టీవీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 65 ఇంచుల 4కే స్మార్ట్ గూగుల్ టీవీపై ఏకంగా 64 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.

భారీ డిస్కౌంట్
టీసీఎల్ 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1,24,990కాగా అమెజాన్‌లో 64 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,990కి లభిస్తోంది. దీనికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీ 65 ఇంచుల పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. 4K రిజల్యూషన్ (3840 × 2160), HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో HVA ప్యానెల్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీని ఇచ్చారు. ఇవన్నీ కలిపి క్లియర్, కలర్ ఫుల్ పిక్చర్ ఇస్తాయి. సినిమాలు, స్పోర్ట్స్ చూసేటప్పుడు మంచి అనుభూతి పొందొచ్చు.
సౌండ్ అండ్ ఆడియో ఫీచర్లు
ఈ టీవీలో 24W సౌండ్ అవుట్‌పుట్ సౌండ్‌ను ఇచ్చారు. ఈ టీవీ డాల్బీ ఆట్మాస్, డీటీఎస్-ఎక్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇవి థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ ఇస్తాయి. సినిమాలు చూస్తే మరింత రియలిస్టిక్‌గా అనిపిస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు, పనితీరు
ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఈ టీవీ 64-బిట్ క్వార్డ్ కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీవీలోప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. అలాగే ఈ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్, వెబ్ బ్రౌజర్ వంటి ఆప్షన్లు కూడా ఇచ్చారు. వాయిస్‌తో కూడా టీవీని కంట్రోల్ చేయవచ్చు.
కనెక్టివిటీ అండ్ డిజైన్
ఈ టీవీకి మంచి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, LAN, Wi-Fi (WiFi 5), AV ఇన్‌పుట్, సాటిలైట్ ఇన్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ విషయానికొస్తే దీనిని బ్లేజ్ లెస్ మెటాలిక్ డిజైన్, స్లిమ్ లుక్‌తో రూపొందించారు. దీంతో ఈ టీవీ ఇంటి స్టైలిష్ లుక్ ఇస్తుంది.
వారంటీ, ఇతర వివరాలు
టీవీపై 2 సంవత్సరాల వారంటీ, రిమోట్‌పై 6 నెలల వారంటీ అందిస్తున్నారు. ఇక 4 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఈ టీవీ సొంతం. అలాగే ఈ టీవీ ఏటా సుమారు 200 kWh విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటుంది. బాక్స్‌లో టీవీ, స్టాండ్, రిమోట్, బ్యాటరీలు, పవర్ కార్డ్ ఉంటాయి. మొత్తం మీద తక్కువ ధరలో పెద్ద స్క్రీన్, మంచి ఫీచర్లతో కూడిన టీవీ చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

