- Home
- Technology
- Gadgets
- Smart phone: రూ. 15 వేలలో లక్ష రూపాయల విలువైన ఫీచర్లు.. బుర్రపాడు చేసే స్మార్ట్ ఫోన్
Smart phone: రూ. 15 వేలలో లక్ష రూపాయల విలువైన ఫీచర్లు.. బుర్రపాడు చేసే స్మార్ట్ ఫోన్
Smart phone: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం సెర్చ్ చేసే వారికి సామ్‌సంగ్ ఒక అదిరిపోయే ఫోన్‌ను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ఎఫ్70ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు.

పెద్ద డిస్‌ప్లే, స్మూత్ వీయింగ్ అనుభవం
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్70ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 15,998గా ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో పలు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచుల HD+ PLS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అందువల్ల వీడియోలు చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, గేమ్స్ ఆడటం మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. హై బ్రైట్‌నెస్ మోడ్ ఉండటం వల్ల వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద స్క్రీన్ కారణంగా సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
మంచి ప్రాసెసర్
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది రోజువారీ పనులు, యాప్స్ వాడటం, మల్టీటాస్కింగ్ వంటి వాటిని సులభంగా నిర్వహిస్తుంది. ఫోన్‌లో 6GB RAM ఉండటం వల్ల ఒకేసారి అనేక యాప్స్ ఉపయోగించినా ల్యాగ్ తక్కువగా ఉంటుంది. అలాగే 128GB స్టోరేజ్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు, యాప్స్ స్టోర్ చేసుకోవడానికి సరిపడా స్పేస్ ఉంటుంది.
భారీ బ్యాటరీ మరో ఆకర్షణ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6000 mAh బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఈ బ్యాటరీ రెండు రోజుల వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదనంగా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్.
అదిరిపోయే కెమెరా
సామ్‌సంగ్ Galaxy F70e 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, డెప్త్ సెన్సర్‌ను ఇచ్చారు. ఈ కెమెరాతో స్పష్టమైన ఫోటోలు తీసుకోవచ్చు. పోర్ట్రెట్ ఫోటోలు కూడా మంచి బ్లర్ ఎఫెక్ట్‌తో వస్తాయి. ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్స్ చేయడానికి సరిపడా క్వాలిటీని అందిస్తుంది.
డిజైన్, భద్రతా ఫీచర్లు, సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్ లైమ్‌లైట్ గ్రీన్ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో లెదర్‌లాంటి ఫినిష్ ఇవ్వడం వల్ల ఫోన్ ప్రీమియంగా అనిపిస్తుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ లాంటివి ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌కు 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనుంది.

