- Home
- Technology
- Gadgets
- Lock: ఈ తాళానికి తాళం చెవి ఉండదు.. ఫింగర్ ప్రింట్‌తో ఓపెన్ అయ్యే స్మార్ట్ లాక్
Lock: ఈ తాళానికి తాళం చెవి ఉండదు.. ఫింగర్ ప్రింట్‌తో ఓపెన్ అయ్యే స్మార్ట్ లాక్
Lock: మారిన కాలంతో పాటు వస్తువులు కూడా మారిపోతున్నాయి. చివరికి తాళాలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. అమెజాన్‌లో వెయ్యి రూపాయలలోపు అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ స్మార్ట్ లాక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వేలిముద్రతోనే అన్‌లాక్.. తాళం చెవి అవసరం లేదు
ఇంటి భద్రత, ఆఫీస్ లాకర్లు, బ్యాగులు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచాలనుకునే వారికి సీబీకే స్మార్ట్ లాక్ ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ పాడ్‌లాక్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో తాళం చెవి లేదా పాస్‌వర్డ్ అవసరం ఉండదు. మీ వేలిముద్రతోనే క్షణాల్లో లాక్‌ను తెరవొచ్చు. ఆధునిక బయోమెట్రిక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్మార్ట్ లాక్ భద్రతతో పాటు వినియోగంలోనూ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ ప్యాడ్‌లాక్‌లో బ్లూటూత్, మొబైల్ యాప్ లేదా తాళం చెవి అవసరం ఉండదు. ముందుగా నమోదు చేసిన వేలిముద్రతోనే లాక్‌ను తెరవవచ్చు. దీంతో తాళం చెవి పోతుందేమో, పాస్‌వర్డ్ మరిచిపోతామేమో అనే టెన్షన్ ఉండదు. చిన్నపిల్లలు, పెద్దవారు కూడా సులభంగా ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు. భద్రత కోసం మొదట అడ్మిన్ వేలిముద్రను నమోదు చేయడం మంచిది.
0.5 సెకన్లలో అన్‌లాక్.. 20 ఫింగర్‌ప్రింట్లు స్టోర్ చేసే సౌకర్యం
ఈ బయోమెట్రిక్ లాక్ కేవలం అర సెకనులోనే అన్‌లాక్ అవుతుంది. ఇందులో గరిష్ఠంగా 20 వరకు వేలిముద్రలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా కార్యాలయంలో ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే లాక్‌ను సురక్షితంగా వినియోగించుకునే వీలుంటుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే నెలల పాటు వినియోగం
ఈ స్మార్ట్ లాక్‌లో రీచార్జ్ చేసుకునే బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ ఛార్జింగ్ కేబుల్ ద్వారా సుమారు ఒక గంటలో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్‌తో దాదాపు 9,000 సార్లు అన్‌లాక్ చేయవచ్చు లేదా సాధారణ వినియోగంలో 6 నుంచి 12 నెలల వరకు బ్యాటరీ పనిచేసే అవకాశం ఉంటుంది. బ్యాటరీ స్థాయి తెలుసుకునేందుకు బ్యాటరీ ఇండికేటర్ కూడా అందుబాటులో ఉంది.
ఇంటి నుంచి ప్రయాణాల వరకు ఎక్కడైనా ఉపయోగించొచ్చు
ఈ ఫింగర్‌ప్రింట్ ప్యాడ్‌లాక్ తక్కువ బరువుతో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇంటి తలుపులు, ఆఫీస్ లాకర్లు, జిమ్ లాకర్లు, స్కూల్ లాకర్లు, సూట్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులు, గోల్ఫ్ బ్యాగులు, సైకిళ్లు, అల్మారాలు వంటి అనేక చోట్ల దీనిని ఉపయోగించవచ్చు. వాటర్‌ప్రూఫ్ మెటల్ బాడీ ఉండటంతో బయట వాతావరణంలో కూడా ఇది సమర్థంగా పనిచేస్తుంది.
బలమైన నిర్మాణం.. తక్కువ విద్యుత్ వినియోగం
ఈ స్మార్ట్ లాక్‌ను జింక్, అలాయ్ స్టీల్‌తో తయారు చేశారు. బలమైన నిర్మాణం ఉండటంతో దీర్ఘకాలం మన్నికగా ఉంటుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసేలా ప్రత్యేక బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీని అందించారు. తరచూ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి పనితీరు అందిస్తుంది. ఇంటి భద్రత, కార్యాలయ భద్రత లేదా ప్రయాణాల సమయంలో విలువైన వస్తువులను రక్షించుకోవాలనుకునే వారికి ఈ బయోమెట్రిక్ స్మార్ట్ లాక్ ఉపయోగకరమైన ఎంపికగా నిలుస్తుంది.

