MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Jio AI Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో UPI పేమెంట్స్ చేయొచ్చు.. జియో నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్

Jio AI Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో UPI పేమెంట్స్ చేయొచ్చు.. జియో నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్

Jio AI Glasses: షాపులో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఫోన్ బయటకు తీయకుండానే డబ్బులు చెల్లించగలిగితే ఎలా ఉంటుంది? కేవలం కళ్లద్దాలతో QR కోడ్‌ను స్కాన్ చేసి, వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా చెల్లింపులు చేసే సదుపాయాన్ని రిలయన్స్ జియో పరిచయం చేసింది.

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 10 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోన్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు
Image Credit : Asianet News

ఫోన్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ఈ సరికొత్త టెక్నాలజీని ప్రదర్శించింది. కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, ఇయర్‌ఫోన్లతో పాటు పలు AI ఆధారిత పరికరాలను సంస్థ చూపించింది. UPI చెల్లింపులు, వివిధ భారతీయ భాషల్లో మాట్లాడటం, లైవ్ ట్రాన్స్‌లేష‌న్‌, క్రికెట్ కామెంటరీ వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి.

జియో AI గ్లాసెస్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ఫీచర్ స్కాన్ అండ్ పే. సాధారణంగా UPI చెల్లింపులు చేయాలంటే ఫోన్ తీసి, లాక్ ఓపెన్ చేసి, పేమెంట్ యాప్‌లోకి వెళ్లి QR కోడ్‌ను స్కాన్ చేయాలి. కానీ ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. కళ్లద్దాల్లోని కెమెరా ద్వారా షాపులో ఉన్న UPI QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. ఆ తర్వాత వాయిస్ కమాండ్ ఇచ్చి చెల్లింపును ప్రారంభించవచ్చు. చెల్లింపును నిర్ధారించిన తర్వాత లావాదేవీ పూర్తవుతుంది. యూపీఐ స‌ర్కిల్‌ నిబంధనల ప్రకారం ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000 వరకు చెల్లించే అవకాశం ఉంది. నెలవారీ పరిమితి రూ.15,000గా ఉంటుంది. ఈ పరిమితులు జియో నిర్ణయించినవి కాకుండా UPI Circle నిబంధనలకు సంబంధించినవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారతీయ భాషల్లో మాట్లాడితే చాలు.. లైవ్ ట్రాన్స్‌లేషన్
Image Credit : Asianet News

భారతీయ భాషల్లో మాట్లాడితే చాలు.. లైవ్ ట్రాన్స్‌లేషన్

భారతదేశంలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు భాష అర్థం కాక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను తగ్గించేందుకు జియో AI గ్లాసెస్‌లో లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు భారతీయ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, వారు చెప్పిన మాటలను AI సాయంతో మరో భాషలోకి అనువదించుకోవచ్చు. దీనివల్ల ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ప్రయాణాలు, వ్యాపార సమావేశాలు, ఇతర ప్రాంతాల ప్రజలతో సంభాషణల సమయంలో ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. యూజ‌ర్లు తమకు తెలిసిన భాషలోనే టెక్నాలజీని ఉపయోగించుకునేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

35
మీటింగ్‌లో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకునే AI నోట్‌ టేకింగ్
Image Credit : Asianet News

మీటింగ్‌లో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకునే AI నోట్‌ టేకింగ్

ఆఫీసు సమావేశాల్లో ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఏదైనా విషయం మర్చిపోతే మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా జియో AI గ్లాసెస్‌లో AI నోట్‌ టేకింగ్ ఫీచర్‌ను కూడా ప్రదర్శించింది. సమావేశాల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని నోట్స్ రూపంలో నమోదు చేసుకోవడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. దీంతో ప్రతి విషయాన్ని చేతితో రాసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. పని సమయంలో ముఖ్యమైన వివరాలను గుర్తుంచుకోవడానికి, అవసరమైన సమాచారాన్ని తర్వాత పరిశీలించడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, నోట్స్‌ను ఎలా భద్రపరుస్తుంది వంటి పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

45
పనిలో ఉన్నా.. ప్రయాణంలో ఉన్నా లైవ్ క్రికెట్ కామెంటరీ
Image Credit : Asianet News

పనిలో ఉన్నా.. ప్రయాణంలో ఉన్నా లైవ్ క్రికెట్ కామెంటరీ

క్రికెట్ అభిమానులకు కూడా జియో AI గ్లాసెస్ ఉపయోగపడేలా ఫీచర్లను ప్రదర్శించింది. లైవ్ క్రికెట్ కామెంటరీ ద్వారా మ్యాచ్‌లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టీవీ ముందు కూర్చోలేని వారు, ప్రయాణంలో ఉన్నవారు ఇతర పనులు చేసుకుంటూనే మ్యాచ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

క్రికెట్‌తో పాటు ఆఫీసు పనులు, సమావేశాలు వంటి రోజువారీ అవసరాల్లోనూ ఈ పరికరాలు ఉపయోగపడేలా రూపొందించారు. వాయిస్ ఆధారంగా AIతో మాట్లాడటం, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫోన్‌ను పదేపదే బయటకు తీసి చూడాల్సిన అవసరాన్ని తగ్గించడం ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం.

55
రోజువారీ జీవితంలో AI వినియోగాన్ని పెంచడమే లక్ష్యం
Image Credit : Asianet News

రోజువారీ జీవితంలో AI వినియోగాన్ని పెంచడమే లక్ష్యం

జియో AI గ్లాసెస్‌తో పాటు కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, ఇయర్‌ఫోన్లను కూడా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రదర్శించింది. ఈ పరికరాల ద్వారా AI సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకంగా భారతీయ భాషల్లో సేవలు, వాయిస్ కమాండ్లు, లైవ్ ట్రాన్స్‌లేష‌న్‌, నోట్‌ టేకింగ్, UPI చెల్లింపులు వంటి సదుపాయాలు రోజువారీ పనులను సులభతరం చేయగలవు. స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ఫీచర్లను తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పరికరాల ధర, మార్కెట్లోకి విడుదల చేసే తేదీ, సాధారణ వినియోగదారులకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇవి అందుబాటులోకి వస్తే స్మార్ట్ గ్లాసెస్ వినియోగంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
OPPO Find X10 Pro Max: ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ 200MP కెమెరా ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?
Recommended image2
iPhone 17: 99 వేల ఫోన్ కేవలం 55 వేలకే.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
Recommended image3
Best 5G Smartphones Under Rs 10000: రూ. 10 వేల లోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో టాప్-5 మొబైల్స్ ఇవే
Related Stories
Recommended image1
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Recommended image2
Indian Railway: రైలు పట్టాలపై క‌నిపించే రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండ‌వో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved