iPhone 17 vs Galaxy S25: టెక్ దిగ్గజాల ఫైట్.. మీకు ఏది బెస్ట్?
iPhone 17 vs Galaxy S25: టెక్ దిగ్గజాలైన ఆపిల్, శాంసంగ్ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఐఫోన్ 17, గెలక్సీ S25 లతో మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. డిజైన్, కెమెరా, బ్యాటరీ, పనితీరు, ధరలు పోలిస్తే మీకు ఏది బెస్ట్ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 17 vs Galaxy S25: డిజైన్, డిస్ప్లే
టెక్ ప్రపంచం ప్రతి సంవత్సరం రెండు ప్రధాన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కోసం ఎదురు చూస్తుంటుంది. ఒకటి ఆపిల్ నుంచి, మరొకటి శాంసంగ్ నుంచి. ఈసారి ఐఫోన్ 17, గెలక్సీ S25 ప్రీమియమ్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చాయి. వీటి మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఐఫోన్ 17 డిజైన్‌లో ఆపిల్ తన ప్రత్యేక శైలిని కొనసాగించింది. టైటానియం ఫ్రేమ్, మరింత సన్నని బెజెల్స్, చిన్న డైనమిక్ ఐల్యాండ్ తో క్లీన్, తేలికగా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఇక శాంసంగ్ గెలక్సీ S25లో ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 3 ఉపయోగించి స్టైల్, స్ట్రాంగ్ రెండింటిని కలిపింది.
డిస్ప్లే విషయానికి వస్తే..
• iPhone 17: 6.2 అంగుళాల Super Retina XDR OLED, 120Hz రిఫ్రెష్ రేట్
• Galaxy S25: 6.4 అంగుళాల Dynamic AMOLED 2X, అధిక బ్రైట్‌నెస్ తో వస్తుంది. సన్ లైట్ లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది.
iPhone 17 vs Galaxy S25: పనితీరులో ఏది బెటర్?
ఐఫోన్ 17లో ఆపిల్ A19 Pro Bionic చిప్ ఉంది. 3nm ఆర్కిటెక్చర్ ఆధారంగా ఉండి గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్‌లో అద్భుత వేగం, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక గెలక్సీ S25లో Exynos 2500, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ ను ఉఫయోగించారు. ఈ రెండు కూడా AI ఆధారిత పనితీరును అద్భుతంగా అందిస్తాయి.
రోజువారీ ఉపయోగంలో రెండు ఫోన్లు వేగంగా పనిచేస్తాయి. అయితే, యాప్స్ ఆప్టిమైజేషన్, నిరంతర పనితీరులో ఆపిల్ ముందుంది. శాంసంగ్ మాత్రం DeX, One UI 7 వంటి ఫీచర్లతో ప్రొఫెషనల్ వినియోగదారులకు మంచి ఎంపికగా ఉంది.
iPhone 17 vs Galaxy S25: కెమెరా ఫీచర్లు
ఐఫోన్ 17 కొత్త 48MP మెయిన్ సెన్సర్‌తో వచ్చింది. తక్కువ వెలుతురు, సహజ రంగులు, ఖచ్చితమైన వివరాలను అందిస్తుంది. సినీ లవర్స్ కు ఇది ప్లస్ పాయింట్. ఇక శాంసంగ్ గెలక్సీ ఎస్25లో 200MP ప్రైమరీ సెన్సర్ ఉంది. దీంతో మెరుగైన AI సీన్ డిటెక్షన్, అద్భుతమైన జూమ్, 8K వీడియో షూట్‌కు సపోర్ట్ చేస్తుంది. టెలీ ఫోటోగ్రఫీ, హై-ఎండ్ వీడియోల కోసం శాంసంగ్ మంచి ఎంపిక. సినిమాటిక్ వీడియో, కలర్ కాన్సిస్టెన్సీని కోరుకునే వారికి ఆపిల్ మంచి ఎంపిక.
iPhone 17 vs Galaxy S25: బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్టు ఫీచర్లు
ఆపిల్ ఈ సిరీస్ తో మొత్తానికి ఫాస్ట్ ఛార్జింగ్ లీగ్‌లోకి వచ్చింది. 35W వైర్డ్, 20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఇక శాంసంగ్ గెలక్సీ ఎస్25 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. సుమారు 30 నిమిషాల్లో సగం బ్యాటరీ నిండుతుంది. రెండింటి బ్యాటరీ లైఫ్ కూడా రోజంతా కొనసాగుతుంది. కానీ Adaptive Refresh, Power Saving సెట్టింగ్స్ కారణంగా శాంసంగ్ ముందువరుసలో ఉంది.
iPhone 17 vs Galaxy S25: ధరతో పోలిస్తే ఏది బెస్ట్?
ధరలో రెండు కూడా ప్రీమియమ్ క్యాటగిరీలోనే ఉన్నాయి. ఐఫోన్ 17 సుమారు $999 ప్రారంభ ధరతో లభిస్తోంది. శాంసంగ్ గెలక్సీ S25 సుమారు $949 ప్రారంభ ధరతో లభిస్తోంది. ఆపిల్ ఎకోసిస్టమ్, స్థిరమైన పనితీరును కోరుకునే వారకి ఐఫోన్ 17 మంచి ఎంపిక. కస్టమైజేషన్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్రైట్ డిస్ప్లే, ఏఐ కెమెరా ఫీచర్లు కోరుకునే వారికి శాంసంగ్ గెలక్సీ ఎస్25 బెస్ట్ ఎంపికగా ఉంది.