MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Gadgets
  • Foldable Bluetooth Keyboards: వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రావెలింగ్‌కు బెస్ట్.. టాప్ 5 ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఇవే !

Foldable Bluetooth Keyboards: వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రావెలింగ్‌కు బెస్ట్.. టాప్ 5 ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఇవే !

Foldable Bluetooth Keyboards:వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రావెలింగ్‌కు బెస్ట్ గా అందుబాటు ధరలో ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఉన్నాయి. టాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్‌ల కోసం తక్కువ బడ్జెట్‌లో లభించే 5 బెస్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 05 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బడ్జెట్ ధరలో సూపర్ గాడ్జెట్స్.. టాబ్లెట్స్ కోసం 5 బెస్ట్ వైర్‌లెస్ ఫోల్డబుల్ కీబోర్డ్స్
Image Credit : Gemini

బడ్జెట్ ధరలో సూపర్ గాడ్జెట్స్.. టాబ్లెట్స్ కోసం 5 బెస్ట్ వైర్‌లెస్ ఫోల్డబుల్ కీబోర్డ్స్

ఆఫీస్ వర్క్ కోసం లేదా బిజినెస్ ట్రిప్స్ కోసం ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు చాలా ముఖ్యం. అయితే వీటిలో లాంగ్ టైమ్ టైప్ చేయడం కొంచెం కష్టం. అందుకే ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మీ లగేజ్ బ్యాగ్‌లో అస్సలు స్పేస్ తీసుకోవు. ప్రయాణాల్లో చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ డివైజ్‌లతో ఇవి ఈజీగా కనెక్ట్ అవుతాయి. రీఛార్జబుల్ బ్యాటరీలు, మల్టీ డివైజ్ కనెక్టివిటీ, సైలెంట్ కీస్ వంటి ఫీచర్లు వీటిలో ఉంటున్నాయి. అమెజాన్‌లో రూ. 2500 లోపు లభించే 5 బెస్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. జియోనిక్స్ నియో ఫోల్డ్ 11 ఫోల్డబుల్ వైర్‌లెస్ కీబోర్డ్
Image Credit : Amazon

1. జియోనిక్స్ నియో ఫోల్డ్ 11 ఫోల్డబుల్ వైర్‌లెస్ కీబోర్డ్

తక్కువ బడ్జెట్‌లో ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీని ధర కేవలం రూ. 898 మాత్రమే. దీని కస్టమర్ రేటింగ్ 4.4/5 గా ఉంది. ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. దీనిని ఈజీగా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవచ్చు. దీని ఎర్గోనామిక్ డిజైన్ వల్ల టైపింగ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్టూడెంట్స్, ట్రావెలర్స్, రిమోట్ వర్కర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీ 100 కంటే ఎక్కువ గంటల వర్కింగ్ టైమ్‌ను ఇస్తుంది. దీనికి 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది.

Related Articles

Related image1
Mallela Theertham: నల్లమల అడవుల్లో బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్.. మల్లెల తీర్థం రూట్ మ్యాప్ ఇదే
Related image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
36
2. పోర్ట్రానిక్స్ చిక్లెట్ ఫోల్డబుల్ క్వెర్టీ కీబోర్డ్
Image Credit : Amazon

2. పోర్ట్రానిక్స్ చిక్లెట్ ఫోల్డబుల్ క్వెర్టీ కీబోర్డ్

ఈ పోర్ట్రానిక్స్ చిక్లెట్ ఫోల్డబుల్ కీబోర్డ్ ధర రూ. 1,211 కాగా, కస్టమర్ రేటింగ్ 4.0/5 గా ఉంది. ఇది ఒక మినీ పాకెట్ సైజ్ కీబోర్డ్. ఇందులో పెద్ద ఎర్గోనామిక్ కీస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ సమయం టైప్ చేసినా చేతులు అలసిపోవు. రీఛార్జబుల్ బ్యాటరీతో వచ్చే ఈ వైర్‌లెస్ కీబోర్డ్‌ను వన్ టచ్ బటన్‌తో ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లతో ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఆఫీస్ వర్క్ కోసం ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ కంపానియన్.

46
3. టెక్ఫైల్ బ్లూటూత్ వైర్‌లెస్ ఫోల్డబుల్ కీబోర్డ్
Image Credit : Amazon

3. టెక్ఫైల్ బ్లూటూత్ వైర్‌లెస్ ఫోల్డబుల్ కీబోర్డ్

ఈ కీబోర్డ్ ధర రూ. 1,311 గా ఉంది. దీని కస్టమర్ రేటింగ్ 3.9/5. ఇది బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒకేసారి మూడు డివైజ్‌లకు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, లాప్‌టాప్ మధ్య ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇందులో టైప్-సి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సైలెంట్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీనితో పాటు ఒక అటాచబుల్ హోల్డర్ కూడా వస్తుంది, ఇది ప్రయాణాల్లో చాలా కంఫర్ట్‌ను ఇస్తుంది.

56
4. మింగర్ ఫోల్డింగ్ బ్లూటూత్ మినీ పోర్టబుల్ కీబోర్డ్
Image Credit : Amazon

4. మింగర్ ఫోల్డింగ్ బ్లూటూత్ మినీ పోర్టబుల్ కీబోర్డ్

ఎక్కువ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ కోరుకునే వారికి ఇది కరెక్ట్ చాయిస్. దీని ధర రూ. 2,299, రేటింగ్ 3.9/5 గా ఉంది. ఇది చాలా అల్ట్రా-థిన్ ఉంటుంది. ఈజీగా బ్యాగ్‌లలో సర్దేయవచ్చు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ డివైజ్‌లకు క్విక్ వైర్‌లెస్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో వైర్‌లెస్ మౌస్ టచ్‌ప్యాడ్ కూడా ఇన్ బిల్ట్‌గా వస్తుంది. ప్రయాణాలు చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇది బాగా సెట్ అవుతుంది.

66
5. జికార్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్ విత్ టచ్‌ప్యాడ్
Image Credit : Amazon

5. జికార్ట్ ఫోల్డబుల్ బ్లూటూత్ కీబోర్డ్ విత్ టచ్‌ప్యాడ్

మీకు ప్రీమియం ఆప్షన్ కావాలనుకుంటే దీనిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 2,495 కాగా, కస్టమర్ రేటింగ్ 5.0/5 గా ఉంది. ఇందులో అదనంగా ఒక టచ్‌ప్యాడ్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల మీరు విడిగా మౌస్ వాడాల్సిన అవసరం లేదు. దీని నియర్ ఫుల్ సైజ్ లేఅవుట్ వల్ల నార్మల్ కీబోర్డ్‌పై టైప్ చేసిన ఫీలింగ్ వస్తుంది. స్టేబుల్ బ్లూటూత్ కనెక్టివిటీ, రీఛార్జబుల్ బ్యాటరీ సపోర్ట్ దీని సొంతం. మొబైల్ వర్క్‌స్టేషన్ లాగా వాడుకోవడానికి ఇది సూపర్ గాడ్జెట్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఇ-కామర్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Mallela Theertham: నల్లమల అడవుల్లో బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్.. మల్లెల తీర్థం రూట్ మ్యాప్ ఇదే
Recommended image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved