MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Football
  • అవును.. అదే నా లాస్ట్ మ్యాచ్.. ఆ తర్వాత ఆడను.. సంచలన ప్రకటన చేసిన మెస్సీ

అవును.. అదే నా లాస్ట్ మ్యాచ్.. ఆ తర్వాత ఆడను.. సంచలన ప్రకటన చేసిన మెస్సీ

Lionel Messi: ఆధునిక ఫుట్‌బాల్  క్రీడలో  విశేష ప్రేక్షకాధరణ పొందిన అతి కొద్దిమంది ఆటగాళ్లలో ముందువరుసలో నిలుస్తాడు అర్జెంటీనా సూపర్  స్టార్ లియోనల్ మెస్సీ.   ఖతర్ లో తన జట్టును  ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Dec 14 2022, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అర్జెంటీనా  సారథి, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన కెరీర్, రిటైర్మెంట్ పై వస్తున్న  ఊహాగానాలపై నోరువిప్పాడు. తాను చివరి  మ్యాచ్ ఆడబోతున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆదివారం  ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో జరుగబోయే మ్యాచ్ తనకు చివరిదని  స్పష్టం చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రపంచకప్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్దిరోజులగా ఊహాగానాలు వస్తున్నాయి. మెస్సీ వయసు ఇప్పుడు 35  ఏండ్లు.  ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్ లు ఆడిన మెస్సీ  తన జట్టును విశ్వవిజేతగా నిలపలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం  ఆరు నూరైనా ఆ  పని చేయాల్సిందేనని పట్టుబట్టి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే  అర్జెంటీనా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 

36

వయసు భారం రీత్యా మెస్సీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని..  తన కెరీర్ లో అర్జెంటీనా తరఫున ఇవే చివరి మ్యాచ్ లు అని వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెస్సీ.. క్రొయేషియాతో ముగిసిన సెమీఫైనల్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

46

మెస్సీ మాట్లాడుతూ.. ‘అవును. అది నిజమే. మరో ప్రపంచకప్ (2026) కు  చాలా సమయముంది.  కానీ అప్పటివరకు నేను ఆడతానని అనుకోవడం లేదు. ఈ వరల్డ్ కప్ ను ఘనంగా ముగిద్దామనుకుంటున్నా. ఆదివారం జరుగబోయే  ఫైనల్ నాకు ప్రపంచకప్ లో చివరి మ్యాచ్..’ అని తెలిపాడు. 

56

అయితే అర్జెంటీనా గెలిచినా ఓడినా మెస్సీ తన జట్టుకు  రిటైర్మెంట్ ఇస్తానని స్పష్టం చేయలేదు. కానీ ప్రపంచకప్ లో మాత్రం ఇదే  చివరి మ్యాచ్ అని మాత్రం కుండబద్దలుకొట్టాడు. ఒకవేళ అర్జెంటీనా గనక కప్ కొడితే మెస్సీ మరికొన్నాళ్లు జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశముంది. ఓడితే మాత్రం పరిణామాలు మారొచ్చు. 

66

2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో  అదరగొట్టి  అదే ఏడాది  సీనియర్ జట్టులోకి చేరాడు.  2006లో ఫిఫా ప్రపంచకప్ ఆడాడు. ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్ లు ఆడిన మెస్సీకి ఇది ఐదో టోర్నీ.  అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా  మెస్సీకి అరుదైన రికార్డు ఉంది. మరి మెస్సీ తన కెరీర్ ను విజయంతో ముగిస్తాడా..? లేక రొనాల్డో మాదిరిగా విషాదాంతాలే మిగులుతాయా..? అనేది  ఈ ఆదివారం తేలనుంది. 
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved