MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup: లాస్ట్ మినిట్ ట్విస్ట్ అంటే ఇదే బాస్.. డచ్ ను ముంచేసిన మొరాకో, ప్రీక్వార్టర్స్‌లోకి మాస్ ఎంట్రీ

FIFA World Cup: లాస్ట్ మినిట్ ట్విస్ట్ అంటే ఇదే బాస్.. డచ్ ను ముంచేసిన మొరాకో, ప్రీక్వార్టర్స్‌లోకి మాస్ ఎంట్రీ

FIFA World Cup: వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు మొరాకో ఊహించని షాకిచ్చింది. ఉత్కంఠభరిత పెనాల్టీ షూట్‌లో 3-2తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 30 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెదర్లాండ్స్ హార్ట్ బ్రేక్.. ఊహించని రేంజ్‌లో చెలరేగి హిస్టరీ క్రియేట్ చేసిన మొరాకో
Image Credit : Getty

నెదర్లాండ్స్ హార్ట్ బ్రేక్.. ఊహించని రేంజ్‌లో చెలరేగి హిస్టరీ క్రియేట్ చేసిన మొరాకో

ఫిఫా ప్రపంచకప్‌ లలో నెదర్లాండ్స్‌ను వెంటాడుతున్న పెనాల్టీ షూటౌట్ శాపం ఈసారి కూడా వదల్లేదు. న్యూయార్క్ లో జరిగిన వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో మాజీ రన్నరప్స్ అయిన నెదర్లాండ్స్‌కు మొరాకో కోలుకోలేని షాక్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన పెనాల్టీ షూటౌట్ లో డచ్ ముంచేసి, మొరాకో ప్రీ-క్వార్టర్స్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు 1-1తో ఈక్వల్‌గా నిలవడంతో మ్యాచ్ షూటౌట్ కు దారితీసింది. అక్కడ అదృష్టం, దురదృష్టం మారుతూ వచ్చి, చివరకు 3-2 తేడాతో మొరాకో చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గాక్పో గోల్.. ఆపై ఊహించని ట్విస్ట్
Image Credit : Getty

గాక్పో గోల్.. ఆపై ఊహించని ట్విస్ట్

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ హాఫ్ అంతా ఇరు జట్లూ గట్టిగా ఫైట్ చేసినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మొరాకో ప్లేయర్స్ డచ్ డిఫెన్స్‌పై ఓ రేంజ్‌లో ఎటాక్ చేసినా, నెదర్లాండ్స్ తట్టుకుని నిలబడింది. ఇక సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ హీటెక్కింది. 72వ నిమిషంలో నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ కోడి గాక్పో అదిరిపోయే గోల్ కొట్టి తన టీమ్‌కు లీడ్ అందించాడు.

ఈ ఒక్క గోల్‌తో నెదర్లాండ్స్ మ్యాచ్ గెలిచేసి ప్రీ-క్వార్టర్స్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, సరిగ్గా ఇంజూరీ టైమ్‌లో మొరాకో ప్లేయర్ ఇసా డియోప్ హెడర్ ద్వారా మిరాకిల్ గోల్ చేశాడు. ఈ గోల్‌తో డచ్ టీమ్ గుండె పగిలిపోయింది. మ్యాచ్ 1-1తో సమం కావడంతో ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది.

Related Articles

Related image1
WhatsApp Plus Features: వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. నెలకు ₹79 పే చేస్తే వచ్చే 6 సూపర్ ఫీచర్లు ఏంటో తెలుసా?
Related image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
34
సేవ్ చేసిన వెర్‌బ్రగ్గన్.. కానీ షూటౌట్ లో ఫెయిల్
Image Credit : Getty

సేవ్ చేసిన వెర్‌బ్రగ్గన్.. కానీ షూటౌట్ లో ఫెయిల్

విజయం చేతి దాకా వచ్చి చేజారిపోవడంతో నెదర్లాండ్స్ మైండ్ బ్లాక్ అయింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో మొరాకో టీమ్ చాలా సార్లు గోల్ పోస్ట్ దగ్గరకు దూసుకొచ్చింది. అయితే, నెదర్లాండ్స్ గోల్ కీపర్ బార్ట్ వెర్‌బ్రగ్గన్ అద్భుతమైన సేవ్స్‌తో టీమ్‌ను ఆదుకున్నాడు. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా స్కోరు మారలేదు. అయితే, ఈ ఫామ్‌ను వెర్‌బ్రగ్గన్ పెనాల్టీ షూటౌట్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. షూటౌట్‌లో నెదర్లాండ్స్ ఏకంగా మూడు కిక్‌లను మిస్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది. మొరాకో కూడా రెండు కిక్‌లను వేస్ట్ చేసుకున్నా, నెదర్లాండ్స్ చేసిన తప్పులు వాళ్లకు ప్లస్ అయ్యాయి.

44
హీరోగా మారిన యాసిన్ బోనో
Image Credit : Getty

హీరోగా మారిన యాసిన్ బోనో

షూటౌట్ సమయంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు జస్టిన్ క్లైవర్ట్, క్వింటన్ టింబర్, క్రిసెంసియో సమ్మర్‌విల్లే తమ కిక్‌లను గోల్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. అటు మొరాకో టీమ్‌లో నైల్ ఎల్ అయ్నోయి, కెప్టెన్ అష్రఫ్ హకీమి కిక్‌లు కూడా మిస్ అయ్యాయి. అయితే, డచ్ ప్లేయర్ క్రిసెంసియో సమ్మర్‌విల్లే కొట్టిన ఐదో కీలక కిక్‌ను మొరాకో గోల్ కీపర్ యాసిన్ బోనో తన ఎడమ చేత్తో అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. దీంతో బోనో ఈ మ్యాచ్‌కు రియల్ హీరోగా నిలిచాడు. స్టేడియం మొత్తం మొరాకో అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.

సైబారి హిస్టారికల్ గోల్

యాసిన్ బోనో సూపర్ సేవ్ తర్వాత, మొరాకో తరపున లాస్ట్ అండ్ డిసైడింగ్ కిక్ తీసుకోవడానికి ఇస్మాయిల్ సైబారి గ్రౌండ్‌లోకి వచ్చాడు. సైబారి ఎలాంటి ప్రెజర్ లేకుండా కూల్‌గా వచ్చి, డచ్ గోల్ కీపర్ బార్ట్ వెర్‌బ్రూగన్‌ను పూర్తిగా బురిడీ కొట్టించాడు. బంతిని పోస్ట్ ఎడమ మూలలోకి చాలా ఈజీగా పంపేసి నెట్‌ను తాకించాడు. అంతే, మొరాకో టీమ్ హిస్టారికల్ విక్టరీతో ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్ ప్లేయర్స్ గ్రౌండ్‌లోనే ఏడుస్తూ కూలబడిపోగా, మొరాకో లవర్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
WhatsApp Plus Features: వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. నెలకు ₹79 పే చేస్తే వచ్చే 6 సూపర్ ఫీచర్లు ఏంటో తెలుసా?
Recommended image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved