MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: నాలుగు సార్లు ఛాంపియన్‌ జర్మనీకి ఈక్వడార్ ఊహించని షాక్

FIFA World Cup 2026: నాలుగు సార్లు ఛాంపియన్‌ జర్మనీకి ఈక్వడార్ ఊహించని షాక్

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఈక్వడార్ చరిత్రాత్మక విజయం సాధించింది. జర్మనీని 2-1తో ఓడించి రౌండ్ ఆఫ్ 32కు చేరడంతో ఆ దేశ అధ్యక్షుడు నేషనల్ హాలిడే ప్రకటించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jun 26 2026, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రౌండ్‌లో రచ్చ లేపిన ఈక్వడార్.. కింగ్ జర్మనీకి ఘోర పరాజయం.. ప్రెసిడెంట్ క్రేజీ నిర్ణయం
Image Credit : Getty

గ్రౌండ్‌లో రచ్చ లేపిన ఈక్వడార్.. కింగ్ జర్మనీకి ఘోర పరాజయం.. ప్రెసిడెంట్ క్రేజీ నిర్ణయం

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ జరిగింది. గ్రూప్-ఈ పోరులో ఎవరూ ఊహించని ఒక పెద్ద అద్భుతం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ హిస్టరీలోనే అత్యంత సంచలన విజయం నమోదైంది. నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన పవర్‌ఫుల్ జర్మనీ టీమ్‌ను ఈక్వడార్ దారుణంగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ఈక్వడార్ టీమ్ అద్భుతమైన ఆటతీరుతో 2-1 తేడాతో జర్మనీపై గెలిచింది. ఈ చరిత్రాత్మక గెలుపుతో ఈక్వడార్ నేరుగా రౌండ్ ఆఫ్ 32కు క్వాలిఫై అయింది. ఈక్వడార్ ఫుట్‌బాల్ హిస్టరీలో వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకోవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2006లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఆ టీమ్ నాకౌట్ చేరింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జర్మనీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఈక్వడార్
Image Credit : ChatGPT

జర్మనీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఈక్వడార్

మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఇరు జట్లు చాలా అగ్రెసివ్‌గా ఆడాయి. జర్మనీ టీమ్ మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే గోల్ కొట్టి 1-0తో లీడ్ సాధించింది. జర్మనీ ప్లేయర్ సానె ఈ సూపర్ గోల్ చేశాడు. విర్ట్జ్ ఇచ్చిన పాస్‌ను వాడుకుంటూ, సానె పెనాల్టీ ఏరియా లోపలి నుంచి ఒక అదిరిపోయే షాట్ కొట్టాడు. అది నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.

జర్మనీ గోల్ కొట్టినా ఈక్వడార్ అస్సలు తగ్గలేదు. మ్యాచ్ 9వ నిమిషంలోనే గట్టి కౌంటర్ ఇస్తూ స్కోరును 1-1తో ఈక్వల్ చేసింది. ఈక్వడార్ ప్లేయర్ నీల్సన్ ఆంగులో చాలా దూరం నుంచి ఒక అద్భుతమైన షాట్‌తో బాల్‌ను గోల్ పోస్ట్‌కు పంపాడు. ఆ తర్వాత రెండు టీమ్స్ గోల్స్ చేయడానికి ఎన్నో ట్రైల్స్ చేశాయి. కానీ ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి స్కోరు 1-1 తో సమంగానే ఉంది.

Related Articles

Related image1
Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !
Related image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
35
సెకండ్ హాఫ్‌లో అటాకింగ్ గేమ్.. విన్నింగ్ గోల్
Image Credit : Getty

సెకండ్ హాఫ్‌లో అటాకింగ్ గేమ్.. విన్నింగ్ గోల్

సెకండ్ హాఫ్‌లో ఈక్వడార్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. జర్మనీ కంటే చాలా అగ్రెసివ్‌గా ఆడుతూ మ్యాచ్‌పై పట్టు సాధించింది. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీ డిఫెన్స్‌పై ఈక్వడార్ ప్లేయర్స్ వరుస అటాక్స్‌తో ప్రెజర్ పెంచారు.

ఈక్వడార్ పెంచిన ప్రెజర్‌కు మ్యాచ్ 77వ నిమిషంలో సూపర్ రిజల్ట్ దక్కింది. గొంజాల్లో ప్లాటా ఒక మైండ్ బ్లోయింగ్ గోల్ చేసి తన టీమ్‌కు 2-1 లీడ్ అందించాడు. రైట్ వింగ్ నుంచి వచ్చిన కార్నర్ కిక్‌ను గొంజాల్లో పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు. ఒక అదిరిపోయే షాట్‌తో మ్యాచ్‌లో తన ఫస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి నిమిషాల్లో జర్మనీ స్కోరును ఈక్వల్ చేయకుండా ఈక్వడార్ డిఫెన్స్ గట్టిగా అడ్డుకుంది.

45
ప్రెసిడెంట్ క్రేజీ అనౌన్స్‌మెంట్.. నేషనల్ హాలిడే
Image Credit : Getty

ప్రెసిడెంట్ క్రేజీ అనౌన్స్‌మెంట్.. నేషనల్ హాలిడే

జర్మనీపై ఈ చరిత్రాత్మక గెలుపుతో ఈక్వడార్ దేశంలో పండగ వాతావరణం నెలకొంది. తమ టీమ్ ఫిఫా వరల్డ్ కప్ 2026 నాకౌట్ స్టేజ్‌కు క్వాలిఫై అయిన ఆనందంలో ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవా ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకరోజు నేషనల్ హాలిడే ప్రకటిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డేనియల్ నోబోవా మాట్లాడుతూ, తమ ప్లేయర్స్, కోచ్ సెబాస్టియన్ బెకాసెస్సేకు థాంక్స్ చెప్పారు. ఎన్నో విమర్శలు, అవమానాలు, కష్ట కాలాలను తట్టుకుని నిలబడి, దేశానికి ఇంతటి పెద్ద విజయాన్ని, గర్వాన్ని తెచ్చిపెట్టినందుకు ఆయన టీమ్‌ను మెచ్చుకున్నారు. 'రేపు సెలవు దినం ! ఈక్వడార్ జిందాబాద్' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

55
గ్రూప్ స్టేజ్‌లో జర్మనీ పొజిషన్ ఏంటి?
Image Credit : Getty

గ్రూప్ స్టేజ్‌లో జర్మనీ పొజిషన్ ఏంటి?

జర్మనీ లాంటి స్ట్రాంగ్ టీమ్‌పై ఈక్వడార్ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఒక పెద్ద అప్‌సెట్‌గా నిలిచిపోతుంది. ఈ ఓటమితో జర్మనీకి పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. ఎందుకంటే జర్మనీ టీమ్ అప్పటికే రౌండ్ ఆఫ్ 32లో తన ప్లేస్‌ను కన్ఫర్మ్ చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, జర్మనీ గ్రూప్-ఈ లో ఫస్ట్ ప్లేస్‌లోనే కొనసాగుతోంది. అయితే ఈక్వడార్ మాత్రం ఈ మ్యాచ్ గెలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32 టికెట్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ ఈక్వడార్ ఆటతీరును తెగ మెచ్చుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lionel Messi : లైవ్ మ్యాచ్‌లో ఏడ్చేసిన మెస్సీ.. ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదే
Recommended image2
FIFA Knockout Rules : ఒక్క కార్డుతో వరల్డ్ కప్ నుంచే అవుట్.. ఫిఫా రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే !
Recommended image3
Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !
Related Stories
Recommended image1
Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved