MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Football
  • అరబ్బుల అడ్డాలో మాయ చేయనున్న మనోహరి.. ఫిఫా ముగింపు వేడుకలలో బాహుబలి బామ..

అరబ్బుల అడ్డాలో మాయ చేయనున్న మనోహరి.. ఫిఫా ముగింపు వేడుకలలో బాహుబలి బామ..

FIFA World Cup 2022: సుమారు నెల రోజులుగా ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో నేడు తుది అంకం  జరగనున్నది.    అర్జెంటీనా - ఫ్రాన్స్ ల మధ్య  ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే తుది సమరానికి ముందు  లుసాలీ స్టేడియానికి వచ్చే అభిమానులను ఉర్రూతలూగించడానికి మనోహరి సిద్ధమైంది. 

2 Min read
Author : Srinivas M
| Updated : Dec 18 2022, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నవంబర్ 20  న ఆరంభమైన ఫిఫా ప్రపంచకప్ నేడు జరిగే ఫైనల్ తో ముగియనున్నది.  ఫైనల్ పోరు   దోహాలోని స్థానిక సమయం ఆరు గంటలకు ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు  పూర్తయ్యాయి. ఫైనల్ కంటే ముందు  ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఖతర్ ప్రభుత్వం, పిఫా సిద్ధమయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముగింపు వేడుకలకు గాను   ప్రముఖ బాలీవుడ్ నటి, తెలుగులో పలు  ఐటెమ్ సాంగ్స్ చేసి ఇక్కడి కుర్రాళ్లను తన అందచందాలతో కట్టిపడేసిన నోరా ఫతేహి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నది.  15 నిమిషాల పాటు సాగే  ముగింపు వేడుకలలో  భాగంగా  నోరాకు కూడా డాన్స్ చేసే అవకాశం దక్కింది.  

36

ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్  బాల్కీస్, ఇరాక్  గాయని  రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ లు కూడా  ఈ వేడుకలలో అభిమానులను అలరించనున్నారు. ముగింపు వేడుకలు ముగిసిన తర్వాత   అర్జెంటీనా - ఫ్రాన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది.   భారత కాలమానం  ప్రకారం నేటి రాత్రి 8.30 నుంచి అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య   తుది సమరం మొదలవుతుంది. 

46

ఇక అరబ్బుల అడ్డా ఖతర్ లో  ఫతేహి  నృత్యాన్ని లైవ్ ద్వారా వీక్షించాలంటే   స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్ ద్వారా వీక్షించొచ్చు.  మొబైల్ లో అయితే జియో సినిమా యాప్, వెబ్ సైట్ లలో ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూడొచ్చు. ఫిఫా  థీమ్ సాంగ్ లో కూడా నోరా ఫతేహి తన డాన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. 

56

కెనడాకు చెందిన నోరా ఫతేహి.. బాలీవుడ్ సినిమా రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్ చిత్రంతో   హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది.   ఆ తర్వాత తెలుగులో టెంపర్ లో ‘ఇట్టాగే రెచ్చిపోనా’, బాహుబలిలో ‘మనోహరి’, కిక్2 లో ‘కిరుక్ కిక్’  ఊపిరిలో ‘డోర్ నెంబర్’ పాటలలో మెరిసి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. బాలీవుడ్ లో ఆమె చేసిన డాన్స్ నెంబర్స్ అన్నీ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి.   

66

తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన వరల్డ్ కప్ లోటును తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా.. వరుసగా రెండో సారి (గెలిస్తే మూడోసారి)  కప్ కొట్టడానికి ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతున్నది.  మరి నేటి రాత్రి  ఖతర్ లో  విశ్వవిజేతగా నిలిచేదెవరోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ మెగా పోరకు ముందు స్టేడియానికి వచ్చే అభిమానులకు  నోరా అందాల విందును వడ్డించనున్నది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved