MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈ కూరల్లో పసుపు వేయొద్దు తెలుసా?

ఈ కూరల్లో పసుపు వేయొద్దు తెలుసా?

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తీసుకుంటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. అందుకే దీన్ని ప్రతిరోజూ కూరలో వేస్తుంటాం. కానీ కొన్ని కూరల్లో పసుపును వేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 01 2025, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పసుపు కూరకు మంచి రంగు, రుచిని అందిస్తుంది. అందుకే మనం ప్రతిరోజూ ప్రతి ఒక్క కూరలో ఖచ్చితంగా పసుపును వేస్తుంటాం. ఈ పసుపు కూరకు మంచి రంగును ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తెలుసా? పసుపును రోజూ తీసుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉంటాం. కానీ కొన్ని రకాల కూరల్లో పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎదుకంటే పసుపు వల్ల ఆ కూర రుచి, రంగు రెండూ నాశనమవుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పసుపును ఏయే కూరల్లో వేయకూడదు

వంకాయ కూరలో పసుపు వేయొద్దు

అవును వంకాయ కూరలో పసుపు వేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కూరలు మంచి రంగు, రుచి రావడానికే పసుపు వేస్తుంటారు. కానీ వంకాయ కూరలో మాత్రం పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపు వల్ల వంకాయ కూర రుచి, ఆకృతి నాశనమవుతాయి. అంతేకాదు పసుపు వల్ల వంకాయ కూర చేదుగా కూడా అవుతుంది. అందుకే వంకాయలో పసుపు వేయొద్దని చెప్తారు. 

36

మెంతికూరలో పసుపు వేయొద్దు 

వంకాయలోనే కాదు మెంతికూరలో కూడా పసుపును వేయకూడదు. ఎందుకంటే మెంతి కూర ఇప్పటికే కొంచెం చేదుగా ఉంటుంది. దీనిలో పసుపును వేస్తే ఆ కూర మరింత చేదుగా అవుతుంది. నిజం చెప్పాలంటే మెంతికూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి చేదుగా ఉన్న కూరలో పసుపును వేసి మరింత చేదుగా చేయకపోవడమే మంచిది.
 

46

బచ్చలికూరలో వేయొద్దు 

చలికాలంలో బచ్చలికూరను ఎక్కువగా తింటుంటారు. ఈ  ఆకు కూరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి బచ్చలికూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కూరలో మీరు పసుపును వేస్తే గనుక ఈ రుచి పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాల కూర వంటి ఆకు కూరల్లో పసుపును వేయకూడదంటారు. ఎందుకంటే పసుపు వల్ల ఈ ఆకు కూరలు మరింత నల్లగా కనిపిస్తాయి. 

56
mustard greens

mustard greens

ఆవాల ఆకుకూరల్లో పసుపు వాడకూడదు

చలికాలంలో ఆవాల ఆకుకూరలను కూడా ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ ఆకు కూరలో కూడా పసుపును వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో పసుపును వేస్తే దాని టేస్ట్ మొత్తం మారుతుంది. ఆవాలు ఆకుల్లో ఇప్పటికే కొద్దిగా ఉన్న ఆస్ట్రిజెంట్ పసుపు వల్ల మరింత పెరుగుతుంది. దీనివల్ల ఈ కూర టేస్ట్ తగ్గుతుంది. 
 

66

ఉల్లికాడల కూర

ఉల్లికాడల కూరలో కూడా పసుపును వాడకూడదు. ఎందుకంటే ఈ కూరలో పసుపును వేస్తే దాని రుచి చెడిపోతుంది. ఉల్లికాడల కూర టేస్టీగా కావాలంటే మాత్రం ఈ కూరలో మీరు పసుపును వేయకపోవడమే మంచిది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved