MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • గుండె జబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి

గుండె జబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండె జబ్బులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

R Shivallela | Published : Sep 28 2023, 01:01 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. ఈ గుండె కొట్టుకున్నంత వరకు మన శరీరానికి ప్రాణం ఉంటుంది. అందుకే గుండె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా? మనం తినే ఆహారాలు కూడా మన గుండెపై ప్రభావాన్నిచూపుతాయి. అందుకే గుండెకు మేలు చేసే ఆహారాలనే తినాలి. 
 

28
<p>heart health</p>

<p>heart health</p>

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల ఎంతో మంది ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది గుండెజబ్బుల కారణంగానే చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్ లో ఏమేం చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38
<p>heart health</p>

<p>heart health</p>


ఆకుకూరలు

ఆకుకూరలు పోషకాలకు మంచి వనరు. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. దీంతో మీకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. బచ్చలికూర,  పాలకూర, కాలే వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చండి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఈ ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-కె, విటమిన్-ఎ, విటమిన్-సి, కాల్షియం వంటి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. 
 

48
Asianet Image

డార్క్ చాక్లెట్

చాక్లెట్ ను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. చాక్లెట్లలో డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును  డార్క్ చాక్లెట్ లను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే డార్క్ చాక్లెట్ మోతాదులోనే తినాలి. 

58
Asianet Image

వాల్ నట్స్

వాల్ నట్స్ పోషకాల బాంఢాగారం. అందుకే దీన్ని సూపర్ ఫుడ్స్ అంటారు. వాల్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

68
heart

heart


బెర్రీలు

బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి మన గుండెను పదిలంగా ఉంచుతాయి. అందుకే వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బెర్రీలను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, శరీర మంటను తగ్గిస్తాయి. 
 

78
Asianet Image

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ముప్పును తగ్గసి్తుంది. దీన్ని క్రమం తప్పకుండా మీ ఆహారంలో పరిమిత మొత్తంలో చేర్చితే మీ గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

88
heart health

heart health

గుండెకు హాని కలిగించే ఆహారాలు

రెడ్ మీట్
ఎనర్జీ డ్రింక్స్
డీప్ ఫ్రైడ్ ఐటమ్స్
పిజ్జా
చైనీస్ ఫుడ్స్

ఇలాంటి ఆహారాలను తింటే మీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

 

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories