Cooking Tips: ఆకుకూరల్లో పసుపు వేస్తే ఏమౌతుంది?
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ.. కొన్ని ఆకుకూరల్లో మాత్రం వేయకూడదట. దీని వల్ల చాలా ప్రమాదమట. కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందామా....

పసుపులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పసుపును మనం రెగ్యులర్ గా వంటలో వాడుతూ ఉంటాం. పసుపు చాలా రకాల వైద్యాల్లో, ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు. చాలా పోషకాలు ఉండే పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది.
పసుపు
పసుపు ఆరోగ్యకరమైన మసాలా దినుసు. ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఇస్తాయి. అందుకే దీన్ని దాదాపు అన్ని వంటకాల్లోనూ వాడుతుంటాం. కానీ కొన్ని కూరలు వండేటప్పుడు మాత్రం పసుపు వేయకూడదు. కానీ మనం తెలియక వేసేస్తాం. దీని వల్ల పసుపు ఆ కూర రుచిని మార్చడమే కాకుండా, పోషకాలను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో వేయకూడదట.
ఆకుకూర
ఆకుకూరలు పోషకాలు నిండిన ఆకుకూరలు. వీటిలో చాలా విటమిన్లు, ఐరన్ ఉంటాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వీటిని రోజూ తినమని డాక్టర్లు చెబుతారు. కానీ ఆకుకూరలు వండేటప్పుడు పసుపు వేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పసుపు ఆకుకూరల అసలు రుచిని మారుస్తుంది. అంతేకాదు, అందులోని పోషకాలను కూడా తగ్గిస్తుంది.
మెంతికూర
మెంతికూర గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని రుచి కాస్త చేదుగా ఉంటుంది. ఈ కూర వండేటప్పుడు పసుపు వేయకూడదని మీకు తెలుసా? ఎందుకంటే పసుపు కూడా కాస్త చేదుగా ఉంటుంది, మెంతికూర కూడా చేదుగా ఉంటుంది. ఈ రెండు కలిస్తే మెంతికూర తినడానికి బాగోదు. అందుకే మెంతికూరలో పసుపు వాడరు.