గోధుమ పిండి, రాగి పిండి..రెండింటిలో ఏది బెస్ట్..?
గోధుమ పిండి, రాగి పిండి రెండూ ఆరోగ్యానికి మంచిదే. కానీ.. రెండింటిలో ఏది ఎక్కువ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం...
ఇండియన్ వంటల్లో ధాన్యాలది కీలక పాత్రం. జొన్నలు, గోధుమలు, రాగులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదని.. చాలా మంది గోధుమ పిండి వాడుతూ ఉంటారు. గోధుమ పిండి వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మరి.. రాగి పిండి సంగతేంటి? అసలు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
రాగి పిండి ప్రయోజనాలు
రాగి పిండి ప్రయోజనాలు:
రాగి పిండిలో ఫైబర్, విటమిన్లు, అమైనో ఆసిడ్లు ఉన్నాయి. పాల కంటే ఎక్కువ కాల్షియం రాగిలో ఉందని నిపుణులు అంటున్నారు. బియ్యం బదులు రాగి తినొచ్చు. పాస్తా, నూడుల్స్, సేమియా కూడా రాగితో చేయొచ్చు. డయాబెటిస్ నియంత్రణకు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గాయాలు త్వరగా మానడానికి రాగి పిండి ఉపయోగపడుతుంది.
గోధుమ పిండి ప్రయోజనాలు
గోధుమ పిండి ప్రయోజనాలు:
గోధుమ పిండితో రొట్టె, పూరి, ఉప్మా, కేక్ లాంటివి చేయొచ్చు. బియ్యం కంటే గోధుమలో ప్రోటీన్ ఎక్కువ. ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఇనుము, జింక్, విటమిన్ బి కూడా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి గోధుమ మంచిది.
గోధుమ పిండి పోషకాలు
గోధుమ పిండిలోని లోపాలు:
గోధుమ మంచిదే అయినా, కొంతమందికి సరిపోదు. సెలియాక్ డిసీజ్, గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు తినకూడదు. గోధుమలోని గ్లూటెన్ జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అలెర్జీ ఉన్నవారికి కడుపు నొప్పి, స్కిన్ దద్దుర్లు వస్తాయి. గోధుమ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
రాగి పిండి పోషకాలు
రాగి పిండిలోని లోపాలు:
రాగి పిండిలోని గోయిట్రోజెన్స్ థైరాయిడ్ సమస్యలు కలిగిస్తాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రాగి ఎక్కువ తినకూడదు. కాల్షియం వల్ల స్టోన్స్ పెరుగుతాయి. ఫైబర్ వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తుంది.
గోధుమ పిండి vs రాగి పిండి: ఏది బెస్ట్?
ఏది తినాలి?
గోధుమ దోశ, చపాతీ చేసేటప్పుడు రాగి పిండి కూడా కలపండి. రెండు పిండుల్లోనూ మంచి గుణాలు ఉన్నాయి. రెండూ కలిపి తింటే మరింత మంచిది. జీర్ణక్రియ బాగుంటుంది. ఏది బెస్ట్ అని ఆలోచించకుండా రెండూ తినండి.