కొత్తిమీర, పుదీనా పచ్చడిని తింటే ఏమౌతుందో తెలుసా?
మనం ప్రతిరోజూ కొత్తిమీర, పుదీనాలను కూరల్లో వేస్తుంటాం. అయితే ఈ రెండితో చేసిన చట్నీని తింటే మాత్రం మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారంటున్నారు నిపుణులు. అవేంటంటే?
టేస్టీ టేస్టీ స్పైసీ ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా చాలా మంది ప్రతిరోజూ ఏదో ఒక చట్నీని తినాలనుకుంటారు. అందుకే కొంతమంది ఊరగాయను కొంచెమైన తింటుంటారు. కానీ ఊరగాయ రోజూ తినడం మంచిది కాదు. అయితే ఈ ఊరగాయ ప్లేస్ లో మీరు రుచికరమైన కొత్తిమీర, పుదీనా పచ్చడిని ఎంచక్కా తినొచ్చు.
ఈ గ్రీన్ చట్నీ జస్ట్ టేస్టీగా మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పుదీనా, కొత్తిమీర చట్నీని ప్రతిరోజూ ఒక టీస్పూన్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అసలు రోజూ ఒక చెంచా కొత్తిమీర, పుదీనా పచ్చడిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొత్తిమీర, పుదీనా చట్నీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఈ కొత్తిమీర,పుదీనా పచ్చడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రీన్ పచ్చడిని రోజూ తింటే మన జీర్ణ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ,కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా ఈ పచ్చడి ప్రయోజనకరంగా ఉంటుందట.
కొత్తిమీర, పుదీనాలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపు కండరాలను సడలించబడతాయి. దీంతో జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాదు పుదీనా మన జీర్ణవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. అలాగే కొత్తిమీరలో చలువ చేసే లక్షణాలుంటాయి. ఇవి ఎసిడిటీ, మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ కొత్తిమీర, పుదీనా పచ్చడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అంతేకాదు దీనిలో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని బాగా తగ్గిస్తుంది.
కొత్తిమీర, పుదీనా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు
కొత్తిమీర
ఒక చిన్న అల్లం ముక్క
చిటికెడు ఉప్పు
ఒక నిమ్మకాయ రసం
రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు
చిటికెడు జీలకర్ర పొడి
కొత్తిమీర, పుదీనా పచ్చడిని ఎలా తయారుచేయాలి
కొత్తిమీర, పుదీనా, అల్లం, ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లి, జీలకర్ర పొడిని మిక్సీలో వేసి పచ్చడి చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం ఆవనూనెను వేసి కలపాలి. కావాలనుకుంటే మీరు దీనిలో పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా తిన్నా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు డిప్ లేదా స్ప్రెడ్ గా ఉపయోగించొచ్చు. ఈ పచ్చడిని పరోటాలతో తినొచ్చు. అలాగే దాల్ రైస్ తో కూడా తినొచ్చు.