MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?

లవంగాలు ఒక మసాలా దినుసు. ఇవి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు వీటిని తింటే ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 14 2024, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మసాలా దినుసు లవంగాల్లో ఉండే పోషకాలు జీవక్రియ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మన శరీరం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటుంది. మరి మధుమేహులు లవంగాలను తినడం వల్ల ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

లవంగాల పోషకాలు

లవంగాల్లో ఫైబర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి కూడా సహాయపడతాయి. 

36

మధుమేహ వ్యాధిగ్రస్తులకు లవంగాలు

లవంగాలు డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మధుమేహులు లవంగాలను ఇన్సులిన్ హార్మోన్లు, జీవక్రియ, శక్తిని ప్రేరేపించడానికి రోజూ లవంగాలను తినొచ్చు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి లవంగాలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

46

గుండె జబ్బులను తగ్గిస్తుంది

లవంగాలను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 1.5 గ్రాముల లవంగాలు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

56

వైరల్ ఇన్ఫెక్షన్లు నయం 

ఇన్ఫ్లుఎంజా, డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ లవంగాలను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 

 

66

జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది

లవంగాలు కడుపు రుగ్మతలు, వాంతులు,  వికారం వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి కూడా సహాయపడతాయి. మన ఇళ్లలో మనం వండే చాలా వంటకాల్లో లవంగాలను చేర్చడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved