Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • బియ్యం తినే అలవాటు ఉంటే ఏమౌతుందో తెలుసా?

బియ్యం తినే అలవాటు ఉంటే ఏమౌతుందో తెలుసా?

చాలా మందికి ముడి బియ్యాన్ని తినే అలవాటు ఉంటుంది. అటెల్లి, ఇటెల్లి నోట్లో కొన్ని బియ్యాన్ని పోసి నములుతుంటారు. ఇలా తింటే పెళ్లిలో వాన పడుతుందని అంటుంటారు. పెళ్లిలో వాన పడుతుందో ? లేదో? అన్న సంగతిని పక్కన ముడిబియ్యం తింటే మాత్రం మీరు ఎన్నో రోగాల బారిన పడటం ఖాయమంటున్నారు నిపుణులు.  

Shivaleela Rajamoni | Published : Jun 28 2024, 04:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
rice

rice


బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫైబర్, ఇనుము, థియామిన్,రిబోఫ్లేవిన్ తో సహా ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలా మంచి బియ్యాన్ని పచ్చిగానే తింటుంటారు. ఇలా తింటే పెళ్లిలో వాన పడుతుందని పెద్దలు అంటుంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ బియ్యాన్ని తింటే మాత్రం మీరు ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అసలు బియ్యం తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

27
Asianet Image

ఫుడ్ పాయిజనింగ్

బియ్యాన్ని ఎప్పుడూ కూడా ఉడికించి అన్నం రూపంలోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడి బియ్యాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

37
Asianet Image

పొత్తికడుపు నొప్పి 

పచ్చి బియ్యాన్ని తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. నిజానికి ముడి బియ్యం అంత తొందరగా జీర్ణం కావు. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. అందుకే ముడి బియ్యాన్ని అస్సలు తినకూడదు.
 

47
Asianet Image

సోమరితనం 

ముడి బియ్యాన్ని తినడం వల్ల శారీరక అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అలాగే బియ్యాన్ని ఎక్కువగా తింటే సోమరితనం కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

57
Asianet Image

జీర్ణక్రియ అవాంతరాలు 

ముడి బియ్యంలో లెక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. బియ్యాన్ని ఎప్పుడూ కూడా వండుకుని తినడం వల్లే ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

67
Asianet Image

కడుపు ఉబ్బరం 

ముడి బియ్యాన్ని తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం. కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. బియ్యం ప్రేగు కదలికలలో ఇబ్బందిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

77
Asianet Image

అపెండిసైటిస్ కారణాలు 

ముడి బియ్యాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మీకు ఇప్పటికే మీకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే ముడి బియ్యం, వంకాయ, టమాటాలు, శెనగలు, మినప్పప్పు మొదలైన ఆహారాలను తినడం మానుకోవాలి. 

వాంతుల సమస్య 

ముడి బియ్యంలో లెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అంత సులువుగా జీర్ణం కాదు. వీటిని తింటే వాంతులు, విరేచనాలు మొదలైనవి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories