రాత్రి తినగానే నిద్రపోతే ఏమౌతుంది..?
భోజనం చేసిన వెంటనే నిద్రపోవచ్చా..? ఇలా చేయడం వల్ల ఏమౌతుందో తెలుసుకుందాం…
Sleeping
ప్రస్తుతం దాదాపు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. దేనికీ సమయం ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీసు పని, ఇంటి పని అంటూ హడావిడిగా తిరిగేస్తాం. కాస్తో కూస్తో.. రాత్రి పడుకునే ముందు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ సమయం లేకపోవడం వల్ల.. చాలా మంది రాత్రి భోజనం చేశామా.. వెంటనే వెళ్లి బెడ్ ఎక్కేస్తారు. కానీ.. ఇలా భోజనం చేసిన వెంటనే నిద్రపోవచ్చా..? ఇలా చేయడం వల్ల ఏమౌతుందో తెలుసుకుందాం…
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే ఏమౌతుంది?
రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీని కారణంగా మీకు గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు.. తినగానే పడకోవడం వల్ల ఛాతి దగ్గర బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు తిన్న వెంటనే పడుకోకూడదు.
ఇవి మాత్రమే కాదు.. తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులో యాసిడ్ తయారై.. అది గొంతులోకి కూడా వచ్చేస్తుందట. అసిడిటీ సమస్యలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తాయి.
Sleeping With Mouth Open
జీర్ణ సమస్యలు..
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వదు, దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది.
అజీర్ణం శరీరంలోని శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది, ఇది మీకు మంచి నిద్రను పొందడం కష్టతరం చేస్తుంది. ఇది శరీరంలో అలసట, చంచలతను కలిగిస్తుంది.
రాత్రి భోజనం, నిద్ర మధ్య గ్యాప్ లేకపోతే అది మీ రక్తంలో చక్కెర స్థాయిని అసమతుల్యత చేస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది, ఇది మధుమేహం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
sleeping
రాత్రి భోజనానికీ, నిద్రకు ఎంత గ్యాప్ అవసరం..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2.5-3 గంటల గ్యాప్ ఉండాలి. మీకు జీర్ణ సమస్యలు ఉంటే, 3-4 గంటల విరామం తీసుకోవడం మరింత ఉత్తమం.