MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • మొక్కజొన్న తింటే ఏమవుతుందో తెలుసా?

మొక్కజొన్న తింటే ఏమవుతుందో తెలుసా?

వర్షంలో వేడి వేడి మొక్క జొన్నపై నిమ్మరసం, ఉప్పు, కారం జల్లి తింటుంటే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో సాయంత్రం అయితే చాలు.. రోడ్డు పక్కనున్న బండి దగ్గర నిలబడి కాల్చిన మొక్కజొన్నను తింటుంటారు. కానీ మొక్కలను జొన్నలను తింటే ఏమౌతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 18 2024, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా ఉంటాయి. వర్షాకాలంలో రోడ్ల పక్కనున్న తోపుడు బండ్ల మీద వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే ఇవి టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ వర్షకాలంలో ఈ కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇమ్యూనిటీ పవర్: 

కాల్చిన మొక్కజొన్నను మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కజొన్న పొత్తు తింటే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

38

మలబద్ధకం

మొక్కజొన్న మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాల్చిన మొక్కజొన్నను తింటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే దీన్ని మీరు ఉడకబెట్టి కూడా తినొచ్చు. 
 

48

మెరుగైన కంటిచూపు

మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని మన డైట్ లో చేర్చుకుంటే కంటిచూపు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. 
 

58
Image: Freepik

Image: Freepik

గుండె ఆరోగ్యం

వర్షంలో కాల్చిన మొక్కజొన్నను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుందట. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

68

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మొక్కజొన్నలో విటమిన్ సి, బయోఫ్లవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫైబర్ వంటి లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మొక్కజొన్నలోని ఈ లక్షణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 
 

78
Roasted corn

Roasted corn

బలమైన ఎముకలు 

మొక్కజొన్నల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. దీనిని తింటే ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

88

చర్మానికి మేలు

మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలను తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మన చర్మం కూడా హెల్తీగా, ప్రకాశవంతంగా ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved