చలికాలంలో అరటిపండ్లు తింటే ఏమౌతుంది?
అరటిపండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఈ అరటిపండ్లను మరి చలికాలంలో తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మన ఆరోగ్యానికి పండ్లు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఇలాంటి పండ్లలో అరటి ఒకటి. అరటిపండ్లు సీజన్లతో సంబంధం లేకుండా దొరుకుతాయి. అలాగే వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది ఈ పండ్లను ప్రతిరోజూ తింటుంటారు.
నిజానికి అరటిపండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉండటం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మందికి అరటిపండ్లను చలికాలంలో తినాలా? వద్దా? తింటే ఏమౌతుందని డౌట్ వస్తుంటుంది. అందుకే ఈ సీజన్ లో అరటిపండ్లను తినాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటిపండ్ల లక్షణాలు
అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
అరటి పండు తినడం వల్ల కలిగే
ఎముకలు బలోపేతం
చలికాలంలో అరటిపండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చలికాలంలో అరటిపండ్లను తింటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే అరటిలో ఉండే ఔషద లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అరటిపండ్లు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
శీతాకాలంలో అరటిపండు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో అరటిపండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అరటిపండ్లను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అరటిపండ్లను ఎప్పుడు తినాలి?
అరటిపండ్లను కొన్ని అనారోగ్య సమస్యలున్నప్పుడు అస్సలు తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు లేకుంటేనే అరటిపండ్లను తినాలి. దీనిలో ఉండే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
అరటిపండ్లను ఎప్పుడు తినకూడదు?
చల్లని వాతావరణంలో అంటే వానాకాలం, చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచుగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. మీకు ఇలాంటి దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే అరటి పండ్లను తినకూడదు.
అరటి ఎవరికి మేలు చేస్తుంది?
అరటి పండ్లు చాలా మందికి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి అరటిపండ్లు మంచి మేలు చేస్తాయి. అలాగే ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లు హైబీపీని, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.