MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • రోజూ పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే ఏమౌతుంది..?

రోజూ పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే ఏమౌతుంది..?

వేపుడు కూరలు, బయటి ఆహారాలు ఎక్కువగా తినడం వల్లే.. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే... ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
 

Ramya Sridhar | Published : Oct 04 2024, 01:27 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Bottle gourd

Bottle gourd

మనకు చాలా రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సొరకాయ కూడా ఒకటి. కాలంతో సంబంధం లేకుండా.. మనకు లభించే కూరగాయ ఇది. మన బాడీనీ హైడ్రేటెడ్ గా ఉంచడంలో సొరకాయ సహాయపడుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయ ఇది. ఈ రోజుల్లో చాలా మంది బయటి ఆహారాలకు, వేడు కూరలకు అలవాటు పడిపోతున్నారు. వేపుడు కూరలు, బయటి ఆహారాలు ఎక్కువగా తినడం వల్లే.. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే... ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

25
bottle gourd juice

bottle gourd juice

మన డైట్ లో...  పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. వీటితో పాటు.. కచ్చితంగా  తినాల్సిన కూరగాయ లో సొరకాయ ముందు ఉంటుంది. సొరకాయను కర్రీగా తినడమే కాకుండా.. దాని జ్యూస్ ని  కూడా మన డైట్ లో భాగం చేసుకోవాలి.  సొరకాయ జ్యూస్ తాగడం మీకు చాలా కష్టంగా అనిపించొచ్చు. కానీ... దాని టేస్ట్  మీకు వాటర్ ఫీలింగ్ మాత్రమే కలుగుతుంది. కానీ పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. వరసగా నెల రోజుల పాటు ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

35
Asianet Image

సొరకాయ  రసం ఎప్పుడు తాగినా మనకు   ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, మీరు దీన్ని ఖాళీ కడుపుతో అంటే పరగడుపున తాగితే, మీరు దాని నుండి మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.  ఈ  సొరకాయ జ్యూస్ లో మనకు  కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. కడుపు సులభంగా క్లియర్ అవుతుంది. మన బాడీలోని టాక్సిన్స్  బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.

45
Asianet Image

సొరకాయ రసం తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ , అసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో  సొరకాయ  రసం తాగండి. దీంతో బరువు సులభంగా తగ్గుతారు.బెల్లీ ఫ్యాట్ కరిగించడంలోనూ మనకు చాలా బాగా సహాయపడుతుంది.
 

55
Asianet Image

సొరకాయలో  నీరు సమృద్ధిగా ఉంటుంది. దీని రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో నీటి లోపం ఉండదు. సొరకాయ రసం ఖాళీ కడుపుతో 1 నెల పాటు తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఐరన్ , పొటాషియం పుష్కలంగా  ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇన్ని ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు... చర్మం యవ్వనంగా కనిపించడంలోనూ ,  చర్మం మెరిసేలా చేయడంలోనూ సహాయపడుతుంది. 
 

Ramya Sridhar
About the Author
Ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories