MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • పచ్చి కొత్తిమీర తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చి కొత్తిమీర తింటే ఏమౌతుందో తెలుసా?

కొత్తిమీరను ప్రతి కూరలో వేస్తారు. ఎందుకంటే ఇది మంచి వాసన రావడమే కాకుండా.. వంటలను టేస్టీగా కూడా చేస్తుంది. అయితే కొత్తిమీరను పచ్చిగా తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Mar 27 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కొత్తిమీర ఫుడ్ ను టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్-సి లు పుష్కలంగా ఉంటాయి. అయితే వంటల్లో వేసుకుని కాకుండా పచ్చికొత్తమీరను తింటే కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మలబద్ధకం 

కొత్తమీర జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే మీ ఆహారంలో పచ్చి కొత్తిమీరను చేర్చండి. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం అనే సమస్య ఉండనే ఉండదు.
 

38

డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరం

డయాబెటీస్ ఉన్నవారికి పచ్చి కొత్తిమీర ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అవును రోజూ కొంచెం పచ్చికొత్తిమీరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో రక్తంలో ఇన్సులిన్ పరిమాణం నియంత్రణలో ఉంటుంది. 
 

48

కొలెస్ట్రాల్ నియంత్రణ 

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటుతో పాటుగా ఎన్నో  ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి పచ్చి కొత్తిమీర బాగా సహాయపడుతుంది. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా తాగొచ్చు. 

58

కళ్ల ఆరోగ్యం 

పచ్చికొత్తిమీర మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటిచూపు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

68

మూత్ర సమస్యలు 

మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చికొత్తిమీరను తింటే మూత్ర సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పచ్చి కొత్తిమీర చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల మూత్రం చికాకు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

78

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది 

పచ్చికొత్తిమీర క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్-ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీక్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

88
coriander leaves

coriander leaves

మూత్రపిండాల ఆరోగ్యం

పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా అని దీన్ని మరీ ఎక్కువగా తినకూడదు. ఎప్పుడూ కూడా మోతాదులోనే తినాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved