సొరకాయ కూర తింటే ఏమౌతుందో తెలుసా?
సొరకాయను మనం ఎన్నో రకాలుగా తింటుంటాం. ఈ కూరగాయ టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. అసలు ఈ సొరకాయను తింటే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
సొరకాయ కూరంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో చట్నీ, సాంబార్, కర్రీ, పప్పు ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. నిజానికి ఈ సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు సొరకాయను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్చ మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.
ముఖ్యంగా సొరకాయను తింటే మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. సొరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంటే ఇది డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచి మేలు చేస్తుందన్న మాట.
సొరకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న హెల్తీ కూరగాయ. ఈ కూరగాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ుంటుంది. అందుకే వీటిని ఎండాకాలంలో ఎక్కువగా తింటారు.
ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకోవచ్చు.
సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య ఉండదు. అంతేకాదు ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. సొరకాయ సబ్జీ, సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు.
మెగ్నీషియం: కొంతమంది ఏ చిన్న పని చేసినా, ఊరికే ఉన్నా బాగా అలసిపోతుంటారు. ఇలాంటి వారికి సొరకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. దీన్ని మీ డైట్ లో చేర్చుకుంటే మీకు అలసటే ఉండదు.
అంతేకాదు ఈ మెగ్నీషియం మీకు కండరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ కూరను తింటే మీ కండరాలు బలంగా ఉంటాయి. అంతేకాదు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఈ కూర సహాయపడుతుంది.
విటమిన్ సి : సొరకాయలో కూడా విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఈ సొరకాయను మీ ఆహారంలో చేర్చుకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు.
కాల్షియం: ఈ గ్రీన్ వెజిటేబుల్‌లో కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. అంటే మీరు సొరకాయ కూరను తింటే మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల బలం కోసం మీరు సొరకాయ జ్యూస్ ను తాగొచ్చు. సొరకాయలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. అంటే దీన్ని తింటే మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
పోషకాలు మెండుగా ఉండే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని మీరు శరీరంలోని నీటి లోపాన్ని కూడా తొలగించొచ్చు. ఇందుకోసం దీని జ్యూస్ తాగాలి. సొరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే దీన్ని తింటే మీరు ఫుడ్ ను అతిగా తినలేరు. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.