ఈ చట్నీ తింటే మీరు బరువు తగ్గడం పక్కా..
బరువు తగ్గాలంటే టేస్టీగా ఉండే ఫుడ్స్ ను తినకూడదని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కొన్ని రకాల టేస్టీ టేస్టీ చట్నీలు మాత్రం మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గాలనుకుంటున్న వారు వాళ్లకు ఇష్టమైన ఐస్ క్రీం, పకోడీలు, మిర్చి బజ్జీ, పిజ్జా వంటి వాటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి బరువును మరింత పెంచుతాయి కాబట్టి. కానీ బరువు తగ్గాలనుకునేవారు కొన్ని టేస్టీ టేస్టీ ఆహారాలను మన డైట్ లో ఎంచక్కా చేర్చుకోవచ్చు.
అవును ఇడ్లీ, దోశతో మీరు తినే చట్నీ బరువు తగ్గడానికి, బరువు పెరగకుండా ఉంచడానికి బాగా సహాయపడతాయి. అసలు ఏయే చట్నీలు మీ బరువును తగ్గించడానికి సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పుదీనా చట్నీ
పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది వారానికి ఒక్కసారైనా పుదీనా చట్నీని చేస్తుంటారు. పుదీనాలో కొత్తిమీరను కూడా కలుపుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర రెండింలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చట్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గొచ్చు.
టమాటా చట్నీ
టమటాల్లో 95 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టమాటాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ఇడ్లీ, దోశతో పాటుగా అన్నంలో టమాటా పచ్చడిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడంతో పాటుగా మీ శరీరంలో అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
దోసకాయ పచ్చడి
టమాటాల లాగే దోసకాయల్లో కూడా ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిలో కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. దోసకాయ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
అంతేకాదు ఇది మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియను పెంచి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పచ్చడికి కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలతో పోపు పెడితే టేస్ట్ అదిరిపోతుంది.
పల్లీ పచ్చడి
పల్లీల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ.. దీంట్లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఇవి జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల మీకు ఆకలి చాలా వరకు తగ్గుతుంది. పల్లీలు మీ శరీరంలో శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. నార్త్ ఇండియాలో పెరుగు, వేరుశెనగతో చట్నీ చేస్తారు. ఈ చట్నీ తింటే మీరు బరువు తగ్గే అవకాశం ఉంది.
మామిడి పచ్చడి
మామిడిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మీ బరువును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. మామిడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎప్పుడూ నిండుగానే ఉంచుతుంది.
ఇది జీర్ణ సమస్యలను తగ్గించి జీవక్రియను పెంచుతుంది. ఒక్కసారి మామిడి పచ్చడిని తయారుచేసి కొన్ని రోజుల వరకు తినొచ్చు. మామిడి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.