టమాట ధరల ఎఫెక్ట్.. పెరిగిన థాలి ధరలు..!
ఇప్పుడు ఆగస్టులో ఏకంగా రూ.200 కి చేరుకుంది. ఈ క్రమంలో థాలి ధరలు కూడా పెంచేయడం గమనార్హం.

Tomato
టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరిగిన ధరల వల్ల టమాటాలను కొనేందుకు సామాన్యులు మొగ్గు చూపడం లేదు. హైదరాబాద్ లోని పలు మార్కెట్ లలో ఈ కూరగాయ ధర మంగళవారం రూ.200 పలికింది. దీంతో, ఈ టమాట ధరలు చూసి అందరూ భయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు టమాట లేకుండా వంటలు వండటానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే,రెస్టారెంట్స్ లో థాలి ధరలు కూడా పెంచేయడం విశేషం. టమాట ధరలు పెరిగిపోవడంతో ఇంట్లో వాళ్లు అవి లేకుండా వంటలు చేసుకుంటారు. కానీ, రెస్టారెంట్స్ లో వాళ్లకు అలా వండకుండా ఉండటం కుదరదు కదా. దీంతో, వారు అమాంతం ధరలు పెంచేశారు.
<p>Cricket Thali</p>
నమ్మకసక్యంగా లేకపోయినా, వెజ్ థాలి ధర రూ.28శాతం, నాన్ వెజ్ థాలి ధర రూ.11శాతం పెంచేశారు. కేవలం టమాట ధరల కారణంగానే ఈ థాలీ ధరలు పెంచడం గమనార్హం.
<p>Thali</p>
జూన్ లో కేజీ టమాట ధర రూ.30 ఉంటే, జులై రూ.100కి చేరింది. ఇప్పుడు ఆగస్టులో ఏకంగా రూ.200 కి చేరుకుంది. ఈ క్రమంలో థాలి ధరలు కూడా పెంచేయడం గమనార్హం.
<p>thali</p>
గత మూడు నెలలుగా ఈ టమాట ధరలతో పాటు, ఉల్లి, ఆలుగడ్డ ధరలు కూడా పెరుగుతుండటంతో, థాలి ధరలను కూడా పెంచుతున్నామని వారు చెబుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ ధరలు పెరుగుతుండటంతో, థాలి ధరలను సైతం గత మూడు నెలలుగానే పెంచుతుండటం విశేషం. నాన్ వెజ్ థాలి కంటే, వెజ్ థాలికి ధరలు ఎక్కువగా పెంచడం విశేషం.
వెజ్ థాలిలో రోటీ, కూరగాయలు( టమాట, ఉల్లిపాయ, పొటాటో), రైస్, పప్పు, పెరుగు, సలాడ్ లాంటివి అందిస్తారు. ఇక నాన్ వెజ్ థాలిలో పప్పుకు బదులు చికెన్ ఉంటుంది. మిగిలినవన్నీ సేమ్ అలానే ఉంటాయి.