MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • ఇది కలిపితే పూరీలు బాగా ఉబ్బుతాయి..

ఇది కలిపితే పూరీలు బాగా ఉబ్బుతాయి..

హోటల్లో పూరీలు బాగా పొంగుతాయి. మెత్తగా కూడా ఉంటాయి. కానీ ఇంట్లో చేసిన పూరీలు మాత్రం మెత్తగా ఉండవు. పొంగవు. కానీ మీరొక పని చేస్తే మాత్రం పూరీలు హోటల్లో లాగ బాగా పొంగుతాయి.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 20 2024, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హోటల్లో ఎలాంటి వంటకాలైనా పర్ఫెక్ట్ గా వస్తాయి. వీటిలో పూరీలు ఒకటి. పూరీలు హోటల్లో బెలూన్ లా పొంగుతాయి. ఎంతో సాఫ్ట్ గా, మెత్తగా కూడా ఉంటాయి. కానీ ఇంట్లో తయారుచేసిన పూరీలు మాత్రం గట్టి గట్టిగా, రొట్టెల్లా అవుతుంటాయి. ముఖ్యంగా పూరీలు పొంగనే పొంగవు. పూరీలు ఉబ్బడానికి ఏం చేయాలో అన్నీ  చేస్తుంటారు. అయినా పూరీలు మాత్రం పొంగవు. మెత్తగా రావు. హోటల్ స్టైల్లో పూరీలు పొంగాలన్నా, మెత్తగా రావాలన్నా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మైదా

పూరీలు మెత్తగా, బెలూన్ లా పొంగడానికి మైదా కూడా సహాయపడుతుంది. ఇందుకోసం పావు వంతు గోధుమ పిండి అంటే మీరు 750 గ్రాముల గోధుమ పిండిని ఉపయోగిస్తే.. దానిలో 250 గ్రాముల మైదా పిండిని వేసి కలపండి. మీకు తెలసా? మైదా పిండి నూనెను ఎక్కువగా పీల్చుకోదు. దీంతో పరీగా మెత్తగా వస్తాయి. ఉబ్బుతాయి. 
 

37

సెమోలినా

సెమోలీనా తో కూడా పూరీలు బాగా పొంగేలా చేయొచ్చు. ఇందుకోసం మైదా వంటి గోధుమ పిండిలో సెమోలినా కలిపితే పూరీలు మెత్తగా ఉంటాయి. బాగా ఉబ్బుతాయి. ఇందుకోసం ఒక కప్పు గోధుమ పిండిలో  2 టీస్పూన్ల సెమోలినాను కలిపి పూరీలను తయారుచేయండి. 

47

చక్కెర

చక్కెర కూడా పూరీలు బెలూన్ లా ఉబ్బడానికి, మెత్తగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందకోసం ఒక కప్పు పూరీ పిండిలో  ½ టీస్పూన్ పంచదారను వేసి కలపండి. చక్కెర వల్ల పూరీలు బెలూన్ లా ఉబ్బడమే కాకుండా..  పూరీలు మంచి బంగారు రంగులోకి కూడా వస్తాయి.

57

టాపియోకా పిండి

టాపియోకా పిండితో కూడా పూరీలు బాగా ఉబ్బుతాయి. సాఫ్ట్ గా కూడా ఉంటాయి. ఇందుకోసం పూరీల పిండిని రోలింగ్ చేసే లేదా రోల్ చేసిన గోధుమపిండిపై దీన్ని చల్లండి. దీనివల్ల పూరీలు బాగా ఉబ్బుతాయి. 
 

67

కట్ చేయండి

పూరీలు చేయడానికి పిండిని బాగా కలుపుకుంటారు. ఆ తర్వాత చేతులను చిన్న చిన్న లడ్డూలా తయారు చేసి పూరీలను తయారుచేస్తారు. కానీ మీరు ఈ పిండిని మీ చేతితో లడ్డూల్లా తయారుచేయడానికి మీరు కావలసిన మొత్తాన్ని కత్తితో కట్ చేయండి. దీంతో పిండి ఒకే పరిమాణంలోకి వస్తుంది. దీంతో పూరీలు కూడా బాగా వస్తాయి.
 

77
poori

poori

సైజ్

పూరీలను ఒక నిర్దిష్ట సైజులో తయారుచేయాలి. అప్పుడే పూరీలు బాగా వస్తాయి. కానీ చాలా మంది పూరీల సైజు కంటే.. ఎక్కుక పెద్దగా తయారుచేస్తారు. దీంతో పూరీల్లా కాకుండా.. ఇవి చపాతీలాగ కనిపిస్తాయి. గట్టిగా కూడా అవుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Recommended image3
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved