ఈ చిన్న పొరపాటు.. ఆహారం.. విషం గా మారుతుంది..!
ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత దాని నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు.. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి
ఫుడ్ పాయిజన్. ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. బయటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి ఇంట్లో ఆహారం తినడం వల్ల కూడా ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు మొదలౌతాయి.
బయట ఆహారం తినప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే.. వాళ్లు ఏం కలుపుతారో మనకు తెలీదు కాబట్టి.. అలా జరుగుతందని అనుకోవచ్చు. కానీ.. ఇంట్లో ఆహారం తినడం వల్ల కూడా పాయిజన్ ఎలా అవుతుంది..? అంటే.. మనకు తెలీకుండానే కొన్ని ఆహారాల్లో కొన్ని పదార్థాలు కలపడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందట. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత దాని నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు.. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. అరటి పండు లేదంటే.. పెరుగన్నం లాంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
శరీరంలో.. నీటి నిల్వ తక్కువగా ఉంటే.. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. నీరు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇక.. గర్భిణీ స్త్రీలు, 60ఏళ్లు పైబడిన మహిళలు.. హెచ్ఐవీ లాంటి సమస్యలతో బాధపడేవారికి ఫుడ్ పాయిజన్ అయితే.. వెంటే ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ అయితే.. ఆహారం తిన్న గంట లేదా.. రెండు గంటలకే లక్షణాలు బయటపడతాయట. నెమ్మదిగా కడుపులో నొప్పి రావడం లేదంటే.. మోషన్స్, వాంతులు , జ్వరం, బాడీ పెయిన్స్ ఇలా ఏదో ఒక రూపంలో బయటపడుతంది.
ఆహార విషానికి కారణం?: ఫుడ్ పాయిజన్ కి ప్రధాన కారణం ఆహారం. ఆహారం సరిగా వండకపోతే. లేదా అది పాడైపోయినప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ అవుతంది. ఫ్రిడ్జ్ ఉంటే తాజాగా కొద్ది గంటలు లేదా ఒక రోజు మాత్రమే ఉంటాయి కొన్ని ఆహారాలు. ఆ విషయం గమనించకుండా.. రోజుల తరపడి ఫ్రిడ్జ్ లో ఉంచి తినడం వల్ల కూడా ఈ సమస్య ఎదురౌతుంది.. అదనంగా, పచ్చి మాంసం లేదా కటింగ్ బోర్డులు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి