రాత్రికి రాత్రే బరువు పెరిగారా..? ఇవే కారణం కావచ్చు..!
విపరీతమైన తేడా కనపడకపోయినా.. ఎంతో కొంత తేడా కనపడుతుంది. మరి అలా రాత్రికి రాత్రే.. మనం బరువు పెరగడానికి గల కారణాలేంటో ఓసారి చూద్దామా..
మీరు నమ్మినా నమ్మకున్నా.. ఒక్కోసారి మనం రాత్రి పడుకొని ఉదయం లేచే సమయం కల్లా.. బరువు పెరిగేస్తూ ఉంటాం. ఒక్క రాత్రిలో బరువు ఎలా పెరుగుతామనే సందేహం మీకు కలగొచ్చు. విపరీతమైన తేడా కనపడకపోయినా.. ఎంతో కొంత తేడా కనపడుతుంది. మరి అలా రాత్రికి రాత్రే.. మనం బరువు పెరగడానికి గల కారణాలేంటో ఓసారి చూద్దామా..
ఉదయం పూట కాకుండా.. రాత్రిపూట మజిల్ గెయిన్ అయ్యే.. వర్కౌట్స్ చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఉంటుందట. బరువులు ఎత్తడం లాంటి వర్కౌట్స్ చేయడం వల్ల.. మజిల్ పెరుగుతుందట. దాని వల్ల.. కొంత బరువు పెరిగే అవకాశం ఉంటుందట.
లేదు.. మేము ఎలాంటి వర్కౌట్స్ చేయలేదు కానీ.. బరువు పెరిగాము అంటారా..? అయితే.. మీరు ముందు రోజు రాత్రి విపరీతంగా మద్యం సేవించి ఉంటారు. మద్యంలో తక్కువ క్యాలరీస్ ఉండొచ్చు. కానీ... ఎక్కువగా తాగడం వల్ల.. తర్వాతి రోజు.. బరువు పెరిగిన భావన మీకు కలుగుతుంది.
మీరు రాత్రిపూట తీసుకున్న ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన దానికంటే.. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల.. శరీరంలో నీటి శాతం పెరిగే అవకాశం ఉంటుందట. ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తిన్నా కూడా.. సులభంగా బరువు పెరుగుతారు.
నమ్మకపోయినా... మీరు మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా.. బరువు పెరుగుతారట. శరీరం నీరు లేకపోవడంతో డీ హైడ్రేట్ అయిపోతుంది. దీని వల్ల.. ఉదయం కల్లా శరీరం ఔన్స్ బరువు పెరిగే అవకాశం ఉంటుదట.
ఇవేమీ కాకపోయినా.. మీకు పడని ఏదైనా ఆహారం, ఎలర్జీ కలిగించే ఆహారం తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందట. శరీరం ఉబ్బిపోతుందట. కాబట్టి.. అలర్జీ కలింగించే ఆహారం తీసుకోకూడదు.
irregular-periods
ఇది కేవలం మహిళలకు మాత్రమే. మహిళలకు పీరియడ్స్ దగ్గరపడిన సమయంలోనూ.. పీరియడ్స్ తర్వాత కూడా.. బరువు పెరుగుతారట. మళ్లీ.. పీరియడ్స్ పూర్తైన తర్వాత... కొద్దిరోజులకు మళ్లీ బరువు మామూలు స్థితికి వచ్చేస్తోంది.
కొత్తగా.. ఏదైనా మెడిసిన్స్ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందట. కొన్ని మందులు.. శరీరంలో వాటర్ రిటెన్షన్ కి కారణం అవుతాయట. దాని వల్ల.. బరువు పెరుగుతారట.
రాత్రి డిన్నర్.. అర్థరాత్రి సమయంలో తిన్నవారు కూడా తొందరగా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. లేటుగా ఆహారం తినడం వల్ల.. జీర్ణక్రియ సరిగా ఉండదు. దాని వల్ల కూడా బరువు పెరుగుతారు.