MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • వీళ్లు మాత్రం డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు

వీళ్లు మాత్రం డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు

నిజానికి డ్రై ఫ్రూట్స్  ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని ఐదుగురు మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఎందుకు? వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 31 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
dry fruits

dry fruits

డ్రై ఫ్రూట్స్ ను తింటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని మనం చిన్నప్పటి నుంచే వింటున్నాం.  అందుకే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను రోజూ తింటుంటారు. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటాం. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలిగినా కొంతమంది మాత్రం వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
diabetes

diabetes

షుగర్ పేషెంట్లు తినకూడదు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయి. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ ను తింటే షుగర్ పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

36

బరువు తగ్గే వ్యక్తులు

బరువు తగ్గాలనుకునే వారు కూడా డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే వీటిని తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బరువు పెరగడానికి ఇవే ప్రధాన వనరు. వీటిని తింటే మీరు బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది. 
 

46

కడుపు సమస్యలు ఉంటే అస్సలు తినకూడదు

కడుపునకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఫైబర్ ను మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.  అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్నిసార్లు మీ కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే కడుపునకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. 

56

అలెర్జీలు ఉన్నవారికి మంచిది కాదు

డ్రై ఫ్రూట్స్ కు అలెర్జీ ఉన్నవారు వీటిని తినకపోవడమే  మంచిది. ఎందుకంటే వీటివల్ల అలెర్జీ వస్తుంది. వీళ్లతో పాటుగా గర్భిణులు కూడా డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో గర్భధారణ సమయంలో హాని కలిగించే కొన్ని పోషకాలుంటాయి. 

66

ముఖానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారు

అలెర్జీల వల్ల చాలా మందికి ముఖంపై ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. మీకు తెలుసా? డ్రై ఫ్రూట్స్ వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వీటిని ఎక్కువగా తింటే గనుక ముఖంపై మొటిమలు అవుతాయి. అలాగే చర్మంపై దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందు స్కిన్ అలర్జీ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్  ను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved