MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • పుచ్చకాయతో పాటు గింజలు తింటే ఏమౌతుందో తెలుసా?

పుచ్చకాయతో పాటు గింజలు తింటే ఏమౌతుందో తెలుసా?

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయలను బాగా తింటుంటారు. ఈ పండును తింటే బాడీ హీట్ తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది పుచ్చకాయ గుజ్జును తిని గింజలను పారేస్తుంటారు. కానీ పుచ్చకాయ గింజలను తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 03 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు వెళ్లకుండా ఎండలు మండుతున్నాయి.ఈ వేడిని తట్టుకోవాలంటే వాటర్ ను పుష్కలంగా తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఉండే పండ్లను కూడా తినాలి. ఈ సీజన్ లో పుచ్చకాయలు మనకు అందుబాటులో ఉంటాయి. నిజానికి పుచ్చకాయలను తింటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చల్లగా కూడా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
water melon

water melon

ఈ సీజన్ లో మన శరీరం కూల్ గా ఉండాలంటే మాత్రం మన ఆహారపు అలవాట్లను చాలా వరకు మార్చుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయను ఖచ్చితంగా తినాలి. అయితే చాలా మంది పుచ్చకాయ గుజ్జును తినేసి వాటి గింజలను విసిరేస్తారు. కానీ పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఈ విత్తనాల్లో మెండుగా ఉంటాయి. అంతేకాక వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అసలు మనం పుచ్చకాయ గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

37
seed

seed

డయాబెటిస్ లో పేషెంట్లకు బెస్ట్

డయాబెటీస్ పేషెంట్లు కొన్ని పండ్లను తినకూడదు. ఎందుకంటే కొన్ని పండ్లలో షుగర్ కంటెంట్ ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినొచ్చు. పుచ్చకాయ గింజలను కూడా తినొచ్చు. అయితే పుచ్చకాయ గింజలు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి. 
 

47
watermelon seeds

watermelon seeds

యవ్వనంగా..

వయసు మీద పడుతున్నా ఈ గింజలను తింటే మీరు యవ్వనంగా కనిపిస్తారు. అవును ఈ గింజలు చర్మాన్ని చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. ముడతలను తగ్గిస్తాయి. పుచ్చకాయ విత్తనాల్లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.
 

57

పురుషుల సంతానోత్పత్తి

ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.అయితే పుచ్చకాయ విత్తనాలు ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. ఈ విత్తనాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమై యాంటీఆక్సిడెంట్. ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. 
 

67
Fruits

Fruits

మెమోరీ పవర్

మెమోరీ పవర్ ను పెంచడానికి పుచ్చకాయ విత్తనాలు బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన జ్ఞాపకశక్తి లేదా మతిమరుపు సమస్యను పరిష్కరించడానికి ఇవి బాగా సహాయపడుతాయి. 
 

77

రక్తపోటు

రక్తపోటుతో బాధపడేవారికి కూడా పుచ్చకాయ విత్తనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే అర్జినిన్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

జీవక్రియ

పుచ్చకాయ విత్తనాల్లో బి కాంప్లెక్స్, విటమిన్లు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved