బీరకాయను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
ఆకుపచ్చని కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి వాటిలో ఒకటి బీరకాయ ఒకటి. బీరకాయలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అందుకే ఆరోగ్య నిపుణులు సమతుల్య, పోషకాహారాన్ని తినాలని సలహానిస్తుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వీటిలో బీరకాయ ఒకటి. బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. బీరకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ridge gourd
కంటి చూపు పెరుగుతుంది
బీరకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే బీరకాయను తింటే మీ కంటి చూపు పెరుగుతుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా రావు.
జీర్ణ ఆరోగ్యం
బీరకాయలో విటమిన్ ఎతో పాటుగా ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అంతేకాదు బీరకాయలో పుష్కలంగా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. బీరకాయను తింటే మీ గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
ridge gourd
వెయిట్ లాస్
బీరకాయలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
బ్లడ్ షుగర్
డయాబెటీస్ రోగులకు కూడా బీరకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
గుండెను ఆరోగ్యంగా
బీరకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.