MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..!

టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..!

టమాటాలు లేని కూరలు చాలా తక్కువ. నిజానికి టమాటాలను అన్నింట్లో వాడతామని ఇవి మనకు పెద్దగా ప్రయోజనకరంగా ఉంటాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే టమాటాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అలాగని వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 26 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వెజిటేబుల్ కర్రీ అయినా.. సలాడ్ అయినా.. టమాటాలు ప్రతి ఫుడ్ రుచిని పెంచుతాయి. అందుకే కదా మనం చూసే ప్రతిలో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనితో పప్పుచారు, చట్నీ అంటూ ఎన్నో వంటకాలను తయారుచేస్తారు. టమాటాల్లో విటమిన్ -సి, ఫైబర్ , కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. టమాటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును టమాటాలను అతిగా  తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రుమాటిక్ నొప్పి

కీళ్ల నొప్పుల సమస్యలు వారు టమాటాలను అతిగా అస్సలు తినకూడదు. ఎందుకంటే టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కీళ్లలో మంట, నొప్పిని కలిగిస్తుంది. అందుకే కీళ్ల నొప్పులతో బాధపడేవారు టమాటాలు తక్కువగా తినాలి.
 

35

మూత్రపిండాల్లో రాళ్లు

మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే కూడా టమాటాలను అతిగా తినకండి. ఎందుకంటే టమాటాల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీరు ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువ టమాటాలను ఉపయోగిస్తే మీ మూత్రపిండాల్లోని రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. అందుకే మూత్రపిండాల్లో  రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటాలు తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.
 

45

ఎసిడిటీ సమస్య

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. మీరు టమాటాలను ఎక్కువగా తింటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీ ఆహారంలో టమాటాల పరిమాణాన్ని తగ్గించండి. 
 

55
Tomato

Tomato

అలెర్జీలు, అంటువ్యాధులు

కొంతమందికి టమాటాలు తినడం వల్ల అలెర్జీ ఉంటుంది. వీళ్లు టమాటాలు ఎక్కువగా తినడం వల్ల నోరు, నాలుక, ముఖంలో వాపు వస్తుంది. అలాగే  గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gutti Vankaya Kothimeera Curry: గుత్తి వంకాయకు కొత్తిమీర టచ్.. రుచి డబుల్
Recommended image2
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image3
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved