రోటీ vs అన్నం : బరువు తగ్గాలంటే రెండింటిలో ఏది బెటర్?
అధిక బరువు తగ్గాలంటే.. అన్నం తినకూడదని, దాని బదులు రోటీ తింటే చాలు అని చాలా మంది నమ్ముతారు. ఇందులో నిజం ఎంత? నిజానికి, ఈ రెరండింటిలో ఏది తింటే బరువు తగ్గుతారో తెలుసుకుందాం...
ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది కామన్ గా చేసే మొదటి పని అన్నం తినడం మానేయడం. అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల బరువు పెరిగిపోతాం అని నమ్ముతారు. అందుకే.. రోటీ అయితే.. ఆ భయం ఉండదు. దీనిలో ఫైబర్ ఉంటుంది కదా అని అనుకుంటారు. అందుకే.. అన్నం బదులు రోటీ తింటారు.
కానీ, ఇందులో ఏది నిజం. నిజంగా అన్నం బదులు రోటీ తింటే బరువు తగ్గుతారా? నిజానికి బరువు తగ్గాలి అనుకునేవారు ఏం తినాలి అనే విషయాలుు ఇప్పుడు చూద్దాం...
బరువు తగ్గడానికి జనాలు క్యాలరీలు తగ్గించుకుంటారు. రొట్టీ, అన్నంలో దాదాపు ఒకే క్యాలరీలు ఉంటాయి. కానీ అన్నం కంటే రొట్టీ మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. కార్బ్స్ మన శరీరానికి అవసరం. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. రొటీలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే... రొటీలో ప్రోటీన్ ఎక్కువ. అన్నంలో ప్రోటీన్ తక్కువ, కానీ అమైనో ఆసిడ్ లైసిన్ ఎక్కువ. అన్నంని పప్పుతో కలిపి తింటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. బరువు తగ్గడానికి అన్నం కంటే జొన్న రొట్టెలు తినడం మంచిది.
అన్నం గ్లూటెన్ లేనిది. గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ హానికరం కాదు. కానీ, బరువు తగ్గాలనుకునేవాళ్లు గ్లూటెన్ లేని ఆహారం తీసుకుంటారు.ఫైనల్ గా బరువు తగ్గడానికి రొటీ మంచిది. ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. అన్నంతో పోలిస్తే రొట్టీలో పీచు పదార్థం, ప్రోటీన్, కొవ్వు తక్కువ. బరువు తగ్గాలనుకుంటే అన్నం కంటే రొట్టీ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనంలోని సమాచారం ప్రాథమిక సమాచారం మాత్రమే. బరువు తగ్గడానికి సరైన వైద్య సలహా తీసుకోండి.