MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చపాతీ కాదు.. బియ్యం పిండి రొట్టె తింటే ఏమౌతుందో తెలుసా?

చపాతీ కాదు.. బియ్యం పిండి రొట్టె తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది గోధుమ పిండి చపాతీలనే ఎక్కువగా తింటుంటారు. కానీ గోధుమ పిండి చపాతీ కంటే బియ్యం పిండి చపాతీనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 15 2025, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో చాలా మంది అన్నం తక్కువగా తింటూ చపాతీ, జొన్న రొట్టెలను ఎక్కువగా తింటున్నారు. జొన్న రొట్టె కంటే గోధుమ చపాతీనే చాలా మంది రోజుకు ఒకటి రెండు పూటలా తింటున్నారు. ఎందుకంటే ఇవి బరువును తగ్గిస్తాయని, బరువు పెరగకుండా చేస్తాయని, పోషకాలు పుష్కలంగా అందుతాయని, శరీరం హెల్తీగా ఉంటుందని వీటిని తినడం అలవాటు చేసుకున్నారు.

 కానీ గోధుమ రొట్టె కంటే బియ్యం పిండితో చేసిన రొట్టెనే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రొట్టె చాలా సులభంగా జీర్ణమవుతుంది.

అలాగే ఈ పిండితో చేసిన రొట్టె టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోటీని ఆకుపచ్చ కూరల్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో రైస్ పిండితో చేసిన రొట్టె తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


బియ్యం పిండి రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బియ్యం పిండిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బియ్యం పిండితో చేసిన రొట్టె తింటే మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రొట్టె మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

35


బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బియ్యం పిండిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పిండి రొట్టెలు మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. మీరు ఒక నెల రోజుల పాటు బియ్యం పిండితో చేసిన రొట్టెను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

బ్లడ్ షుగర్ కంట్రోల్

బియ్యం పిండిలో ప్రోటీన్లతో పాటుగా, ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. అంటే ఇది డయాబెటీస్ పేషెంట్లకు మేలు చేస్తుంది. అదే గోధుమ పిండి చపాతీలను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

45

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బియ్యం పిండితో చేసిన రొట్టె మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం పిండిలో మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. 

చర్మం, జుట్టు ఆరోగ్యం

బియ్యం పిండిలో  విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ రొట్టెను తింటే జుట్టు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి. 
 

55

బియ్యం ప్పిండితో రొట్టెలను ఎలా తయారుచేయాలంటే? 

 2 కప్పుల బియ్యం పిండిలో 1/2 కప్పు నీళ్లు, 1/4 టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కలపండి. దీన్ని మెత్తని పిండిలా చేసుకోండి. ఈ పిండిని 10-15 నిముషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి ప్రతిదాన్ని రొట్టెను చేయండి. దీన్ని రెండు వైపులా నాన్ స్టిక్ పాన్ పై కాల్చండి. అంతే వేడి వేడి బియ్యం పిండి రొట్టె తయారైనట్టే. ఇలాగే వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mustard Oil: అమెరికాలో ఆవనూనె వంటకు ఎందుకు వాడరు? మన దగ్గర ఎందుకు ఆ ఆంక్షలు లేవు?
Recommended image2
Chicken : స్కిన్డ్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్.. ఏది తినడం హెల్త్ కి బెటరో తెలుసా?
Recommended image3
Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved