చలి చంపకుండా ఉండాలంటే.. బ్రేక్ ఫాస్ట్ లో ఇవి చేర్చండి..
చలికాలం మొదలయింది. వాతావరణంలో ఒకలాంటి చల్లదనం వచ్చేసింది. వాతావరణంతో పాటు శరీరంలోనూ మార్పులు వస్తాయి. శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
చలికాలం మొదలయింది. వాతావరణంలో ఒకలాంటి చల్లదనం వచ్చేసింది. వాతావరణంతో పాటు శరీరంలోనూ మార్పులు వస్తాయి. శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
చలికాలం మందంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. దీంతో మలబద్ధకం పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. చలికాలం మిమ్మల్ని బాధించుకుండా ఉండాలంటే..ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల ఆహారపదార్థాలను చేర్చడం వల్ల ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అవేంటో చూడండి...
అరటిపండ్లు
చలికాలంలో ఉదయం పూట అల్పాహారంలో తప్పనిసరిగా బనానా ఉండేలా చూసుకోవాలి. దీంట్లో పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మలబద్ధకం ఉన్న వాళ్లు ప్రతీరోజూ అరటిపండు తినడం మంచిది.
చలికాలంలో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భాల్లో పొప్పడిపండు చాలా మంచిది. పండిన పొప్పడిపండును బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పొప్పడిపండులోని పపైన్ అనే ఎంజూమ్ జీర్ణక్రియను పెంచుతుంది.
పొటాషియం, మినరల్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే యాపిల్స్ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. దీంతో మలబద్ధకం అనే మాటే ఉండదు.
జీర్ణక్రియు దోసకాయ బాగా పనిచేస్తుంది. దోసకాయలోని ఎరప్సిన్ అనే ఎంజైమ్ డైజేషన్ కు తోడ్పడుతుంది. కీరా దోసకాయను ప్రతీరోజు తినడం వల్ల పెపిటిక్ అల్సర్, గ్యాస్ ప్రాబ్లంల నుండి బయటపడొచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి కీరా దోసకాయ బాగా పనిచేస్తుంది.
ఆరోగ్యం విషయంలో తేనెకు సాటి మరొకటి లేదు. గొంతు సమస్యలు, జలుబు రాకుండా ఉంచడంలో తేనె బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ రసంలో తెనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట ఇలా చేయడం వల్ల మెటబాలిజయం పెరుగుతుంది.