టమాటాలను ఏయే కూరల్లో వేయొద్దు?
మనం దాదాపుగా ప్రతి ఒక్క కూరలో టమాటాలను వేస్తుంటాం. కానీ కొన్ని రకాల కూరల్లో మాత్రం టమాటాలను ఎట్టిపరిస్థితిలో వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

tomatoes
సాధారణంగా మనం ప్రతి కూరలో కారం, ఉప్పు, ఉల్లిపాయ, టమాటాలను పక్కాగా వేస్తాం. వీటివల్లే కూరల రంగు, రుచి బాగుంటాయి. ముఖ్యంగా చాలా మందికి ప్రతికూరలో టమాటాలను వేసే అలవాటు ఉంటుంది. నిజానికి విటమిన్ సి పుష్కలంగా ఉండే టమాటాలను తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. కొంతమంది చర్మ సంరక్షణ కోసం వీటిని సూప్, సలాడ్ లల్లో కూడా తింటుంటారు. ఇకపోతే వీటిని కూరల్లో వేయడం వల్ల కూరలు పులపుల్లగా టేస్టీగా ఉంటాయి. నోటికి రుచి బాగుంటుంది.
tomatoes
అయితే కూరల రుచిని పెంచే ఈ టమాటాలను కొన్ని రకాల కూరల్లో వేయకూడదన్న ముచ్చట మీకు తెలుసా? ఈ కూరల్లో గనుక మీరు టమాటాలను వేస్తే ఆ కర్రీ టేస్ట్ మొత్తం మారుతుంది. అందుకే ఏయే కూరల్లో టమాటాలను వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాకరకాయ కూర
నిపుణుల ప్రకారం.. కాకరకాయ కూరలో టమాటాలను అస్సలు వేయకూడదు. కాకరకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే కాకరకాయ కూరలో టమాటాలను వేస్తే కాకరకాయ సరిగ్గా ఉడకదు. రెండోది టమాటా వేయడం వల్ల ఈ కూర జిగటగా మారుతుంది. అలాగే తినేటప్పుడు దీని రుచి కూడా బాగుండదు. అందుకే టమాటాలను తెలిసి తెలిసి కాకరకాయ కూరలో వేయకూడదు.
ఆకుకూరల్లో
చలికాలంలో ఎన్నో రకాల ఆకు కూరలు దొరుకుతాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకు కూరలు ప్రతి మార్కెట్ లో దొరుకుతాయి. కానీ ఆకు కూరల్లో టమాటాలను మాత్రం వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో టమాటాలను వేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది. నిజానికి ఆకుకూరలను ఉడికించేటప్పుడు చాలా నీటిని విడుదల చేస్తాయి. ఇలాంటి కూరల్లో టమాటాలను వేస్తే వాటిలో వాటర్ శాతం ఎక్కువ అవుతుంది. అలాగే ఆకు కూరలను తింటున్నామన్న ఫీలింగ్ రాదు. అందుకే వీటిలో టమాటాలను మాత్రం వేయకూడదు.
గుమ్మడి కాయ
గుమ్మడికాయ కూరని వండుకుని తినేవారు కూడా ఉన్నారు. అయితే గుమ్మడికాయ కూరగాయను కొద్దిగా పుల్లగా, తీయగా చేస్తారు. కాబట్టి ఈ కూరలో కూడా టమాటాను వేయకూడదు. గుమ్మడి కాయ కూరలో టమాటాలు వేస్తే ఆ కూరలో పులుపు ఎక్కువయ్యి దాని టేస్ట్ మొత్తం పోతుంది.
బెండకాయ
బెండకాయ కూరలో కూడా టమాటాలను వేయకూడదు. ఎందుకంటే బెండకాయ ముందే జిగటగా ఉంటుంది. ఇలాంటి దానిలో మీరు టమాటాలను వేస్తే అది మరింత జిగటగా అవుతుంది. ఇంకొకటి టమాటాల పులుపు, బెండకాయ రుచి మంచి కాంబినేషన్ అయితే కాదు. దీనివల్ల టేస్ట్ పూర్తిగా మారుతుంది. కాబట్టి బెండకాయ కూరలో కూడా టమాటాలను వేయకూడదు.