టమాట, కీరదోస కలిసి తీసుకుంటున్నారా..?
కీరదోస, టమాట.. ఈ రెండు విడివిడిగా తినడానికి ఆరోగ్యకరమే. కానీ.. ఈ రెండు కలిపి తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ వంటకాల్లో సలాడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది రకరకాల కాంబినేషన్స్ లో సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఇక ప్రతి సలాడ్ లో చాలా మంది కీరదోస, టమాట వంటి వాటిని కచ్చితంగా తీసుకుంటారు. అయితే.. ఈ రెండు కలిపి తీసుకోవడం నిజంగా ఆరోగ్యమేనా..? అసలు ఈ రెండు కలిపి తీసుకోవచ్చా..? దీనిపై ఆహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది ఇష్టంగా తినే కీరదోస, టమాట కాంబినేషన్ చాలా ప్రమాదమట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. పలువురు పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
కీరదోస, టమాట.. ఈ రెండు విడివిడిగా తినడానికి ఆరోగ్యకరమే. కానీ.. ఈ రెండు కలిపి తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
టమోటా మరియు దోసకాయ కడుపు లో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండు కలిసి తీసుకుంటే, ఇవి గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట మరియు అజీర్ణానికి కారణమవుతాయి.
టమాట, కీరదోస కలిపి తింటే.. కడుపులో యాసిడ్స్ తయారౌతాయట. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుదట. కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తుందని డైటీషియన్స్ చెబుతున్నారు.
ఈ రెండు కలిపి తింటే.. తిన్న ఆహారం జీర్ణం కూడా కాదట. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.
సాధారణంగా కీరదోసకాయ చాలా త్వరగా జీర్ణమౌతుంది. కానీ టమాట దానికి పూర్తి భిన్నమట. టమాట, దాని గింజలు జీర్ణమవ్వడానికి చాలా సమయం తీసుకుంటుందట.
కీర దోసకాయలో అనేక పోషక సూత్రాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. కానీ టమాట మాత్రం దానికి భిన్నంగా ఉంటుందట. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.
టమాట, కీరదోస అన్ని విషయాల్లో భిన్నంగా స్పందిస్తాయట. అందుకే ఈ రెండు కలిపి తింటే.. కడుపులో నొప్పి రావడం లాంటివి జరుగుతాయట.
మరో విషయం ఏమిటంటే.. సలాడ్ ని విడిగా తినాలి కానీ.. భోజనానికి ముందు లేదా.. తర్వాత తీసుకోకూడదట. దానికంటూ ఓ సమయాన్ని కేటాయించుకొని తింటే మంచిదని చెబుతున్నారు.