Peanut Chutney: ఇదొక్కటి చేర్చితే.. ఇడ్లీ చట్నీ టేస్ట్ అదిరిపోతుంది..!
అందరికీ ఈ పల్లీ చట్నీ చేయడం అంతగా కుదరదు. ఈ చట్నీ తయారీలో మనం కేవలం ఒకదానిని కలపడం వల్ల చట్నీ టేస్ట్ డబుల్ అవుతుంది. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం...

వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే రెగ్యులర్ గా వీటిని తినమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మనం వీటిని తినాలంటే.. డైరెక్ట్ గా రోజూ పల్లీలే తినాలని రూల్ ఏమీ లేదు. ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. పీనట్ బటర్, పీటన్ చట్నీ గా అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇడ్లీ, దోశలకు ఈ చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది. అసలు ఇడ్లీ, దోశలకు రుచి ఈ చట్నీ వల్లే వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అందరికీ ఈ పల్లీ చట్నీ చేయడం అంతగా కుదరదు. ఈ చట్నీ తయారీలో మనం కేవలం ఒకదానిని కలపడం వల్ల చట్నీ టేస్ట్ డబుల్ అవుతుంది. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం...
పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి?
నార్మల్ గా పల్లీ చట్నీ దాదాపు అందరూ చేసుకుంటూనే ఉంటారు. అయితే.. కేవలం ఒక దానిని అదనంగా చేర్చడం వల్ల చట్నీ రుచి పెరుగుతుంది. అదే జీడిపప్పు. పల్లీలతో పాటు కేవం 8 నుంచి 10 జీడిపప్పులను కూడా చేరిస్తే.. చట్నీ రుచి రెట్టింపు అవుతుంది.
కావలసిన పదార్థాలు
4 టీస్పూన్ల నూనె
3-4 పచ్చిమిర్చి
2-3 వెల్లుల్లి రెబ్బలు
8-10 జీడిపప్పులు
10-12 కరివేపాకు
1 కప్పు వేరుశనగపప్పు
1 టీస్పూన్ జీలకర్ర
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు ఆవాలు
తయారు చేసే విధానం
ముందుగా, ఏదైనా పాత్రలో పల్లీలు, జీడిపప్పు రెండింటినీ వేయించాలి. వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసి
తరువాత 3-4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ బాగా ఆరిన తర్వాత అందులో ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. సరిపడేంత నీరు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని నూనె వేసి కరివేపాకు, ఆవాలు, తాలింపు గింజలు వేసి.. తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ రుచి మాత్రం అదిరిపోతుంది.
idli recipe
చట్నీ తయారీకి చిట్కాలు...
ఎల్లప్పుడూ వేరుశెనగలను తక్కువ మంట మీద వేయించాలి. లేకుంటే అవి మాడిపోతాయి. చట్నీ రుచి చెడిపోతుంది.
వేరుశెనగ చట్నీ రుచి 2-3 గంటల తర్వాత మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి చల్లటి, ఉడికించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించి దీన్ని తయారు చేయండి. చట్నీ రుచిని రెట్టింపు చేయడానికి, మీరు వేయించిన పల్లీల పొట్టు తీసుకుంటే మరింత మంచిది.