పొట్టిగా ఉన్న పిల్లలకు ఏం పెడితే హైట్ పెరుగుతారో తెలుసా?
కొంతమంది పిల్లల వయసు పెరిగినా.. హైట్ మాత్రం అస్సలు పెరగరు. ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను పెడితే పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. అవేంటంటే?
ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు వారి వయసుకు తగ్గట్టు ఎత్తు అస్సలు పెరగడం లేదు. అయితే కొంతమంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే వారు కూడా పొట్టిగానే ఉంటారు. ఇది జెనెటిక్స్ వల్ల కావొచ్చు.
కానీ కొంతమంది తల్లిదండ్రులు పొడుగ్గా ఉన్నా పిల్లలు మాత్రం పొట్టిగానే ఉంటున్నారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా.. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు పిల్లల ఎత్తును పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?
children health food
పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారాలు
పిల్లలకు పోషకాహారం చాలా అవసరం. ఇది పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. వారి వయసుకు తగ్గట్టు హైట్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే పిల్లలకు విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ పెట్టాలి. అలాగే పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే వారికి విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను పెట్టాలి. ఇవి వేటిలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సాల్మాన్ ఫిష్
పిల్లలకు మాంసాహారం కూడా పెట్టాలి. ముఖ్యంగా సాల్మాన్ ఫిష్ ను పెట్టండి. ఎందుకంటే దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పిల్లలు బాగా ఎదగడానికి సహాయపడతాయి. ఈ చేపల్లో ప్రోటీన్లతో పాటుగా ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి వారి ఎముకలను బలంగా చేయడానికి, వారికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి.
kids foods
గుడ్డు
పిల్లలకు గుడ్డును కూడా ఖచ్చితంగా పెట్టాలి. గుడ్డులో వయసుకు తగ్గట్టు ఎదగడానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్ బి12, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును పిల్లల ఆహారంలో చేర్చాలి. అయితే పిల్లలు ఎక్కువ గుడ్లు తింటే బరువు పెరుగుతారని అనుకుంటే పచ్చసొనను పక్కన పెట్టేసి తెల్ల సొనను ఇవ్వండి.
Kids food
పండ్లు
పండ్లు పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి పిల్లలు మంచి ఎత్తు పెరగడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం మీ పిల్లలకు రోజుకు రెండు మూడు రకాల పండ్లను ఇవ్వాలి. ముఖ్యంగా అరటిపండ్లు పిల్లల ఎత్తును పెంచడానికి బాగా సహాయపడతాయి. అయితే మీ పిల్లలు అరటిపండ్లను తినకపోతే వాటిని స్మూతీ లేదా సలాడ్ గా చేసి ఇవ్వండి.
పాలు
పిల్లల ఆరోగ్యానికి పాలు చాలా అవసరం. ఇవి పిల్లల శారీరక ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. పాలలో పిల్లల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ పిల్లలకు రోజూ రెండు గ్లాసుల పాలను తాగిస్తే వారు బాగా హైట్ పెరుగుతారు. హెల్తీగా ఉంటారు.
ఆకుకూరలు
ఆకు కూరలు కూడా పిల్లలు బాగా హైట్ పెరిగేందుకు బాగా సహాయపడతాయి. ఆకు కూరల్లో ఉండే విటమిన్లు పిల్లల ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలు అందాలంటే పిల్లలకు వారానికి రెండుసార్లు ఆకుకూరను వారి డైట్ లో చేర్చాలి. వీటితో పాటుగా పిల్లలకు పెరుగు, జీడిపప్పు, చిలగడదుంప, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా ఖచ్చితంగా ఇవ్వాలి.