MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Green chillies: పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

Green chillies: పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాాజగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?  సింపుల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం...  

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2025, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వంటగదిలో పచ్చిమిర్చీలను రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు. పచ్చి మిర్చీలు కేవలం కారం కోసమే కాదు, వంటకు రుచిని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. కేవలం చట్నీలకు మాత్రమే కాదూ.. కూరలకు కూడా ఇవి చాలా రుచిని తెస్తాయి. పచ్చి మిరపకాయలు చూడటానికి ఎంత ఫ్రెష్ గా, తాాజగా ఉన్నప్పుడు మనం కొని తెచ్చుకున్నా.. అవి చాలా తక్కువ సమయంలోనే    ఎండుమిర్చిగా మారిపోతాయి.   ఎక్కువ రోజులు ఉంటే అవి ఎండిపోవడం, కళ్లిపోవడం జరుగుతాయి. మరి.. ఇవి ఎక్కువ రోజులు తాజాగా  నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? 

 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

జిప్‌లాక్ బ్యాగ్: దీనికోసం పచ్చిమిర్చిని తెచ్చి వెంటనే బాగా కడిగి, ఆరబెట్టండి. తర్వాత దాని కాడ తీసి, పచ్చిమిర్చిని జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచితే, కనీసం 15 రోజులైనా తాజాగా ఉంటుంది. ముఖ్యంగా దానిలో గాలి ఉండకూడదు. కావాలంటే మీరు ఫ్రీజర్‌లో కూడా ఉంచవచ్చు.

35

ప్లాస్టిక్ బ్యాగ్: మీ దగ్గర జిప్ లాక్ బ్యాగ్ లేకపోతే, ప్లాస్టిక్ బ్యాగ్‌లో గాలి చొరపడకుండా పెట్టాలి. అయితే.. అలా కవర్ లో పెట్టే సమయంలో పచ్చి మిరపకాయలు తడిగా మాత్రం ఉండకూడదు. తడి లేకుండా చూసుకొని ఆ తర్వాతే..ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి, గాలి తగలకుండా ప్యాక్ చేసి  ఫ్రీజర్‌లో ఉంచండి. దీనివల్ల మిర్చి చాలా రోజులు తాజాగా ఉంటుంది.

45

టిష్యూ పేపర్: పచ్చిమిర్చిని సేవ్ చేయడానికి టిష్యూ పేపర్‌ని ఉపయోగించవచ్చు. దీనికోసం పచ్చిమిర్చిని బాగా కడిగి, కాడ తీయాలి. తర్వాత కడిగిన నీరంతా పోయేంత వరకు ఆగి, ఆ తర్వాత  టిష్యూ పేపర్‌లో వేసి బాగా మడవాలి. ఇలా చేస్తే పచ్చిమిర్చి ఒక నెల వరకు తాజాగా ఉంటుంది.

 

55

చెడిపోయిన పచ్చిమిర్చి: పచ్చిమిర్చి నల్లగా మారడం మొదలైతే అది చెడిపోయిందని అర్థం. ఇలాంటి మిర్చిని వెంటనే పారేయండి. లేకపోతే, అది ఇతర మిర్చిని కూడా పాడు చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?
Recommended image2
Peanut Butter: 5 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన పీనట్ బటర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
Recommended image3
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved